Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Must Read:"జగనన్న సురక్ష" ఏంటి- పైసా ఖర్చు లేదు పైగా అన్నీ ఫ్రీ,భలేగుంది బాసూ..!

రాష్ట్ర ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు,వివిధ ప్రభుత్వ పథకాలతో పాటు ప్రభుత్వ సేవలకు సంబంధించి ఏవైనా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి ప్రజలకు రక్షగా.. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరించడానికే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చింది.

ఈ కార్యక్రమం కింద, వాలంటీర్స్ ఒక వారం పాటు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. తెలుసుకున్న వాటిని ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసి సర్టిఫికెట్లు, స్కీమ్స్ అర్హతతో పాటు ప్రభుత్వ సేవలకు సంబంధించి ఏవైనా పెండింగ్ సమస్యలు ఉంటే వాటిని లేవనెత్తడానికి ప్రజలకు తెలియజేస్తూ సంక్షేమ క్యాలెండర్‌ను అందజేస్తారు.

jaganannasuraksha

ఈ కార్యమాన్ని మండల స్థాయి అధికారులు ఎంఆర్ఓ, ఈఓ పీఆర్డీ, ఎంపీడీఓ, డిప్యూటీ తహశీల్దార్, సచివాలయా సిబ్బంది తదితర అధికారులు పాల్గొని గత వారం రోజులుగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ప్రజలు నమోదు చేసుకున్న సర్టిఫికేట్లను, ప్రభుత్వం అందించే పథకాలకు కావలిసిన సర్టిఫికేట్లను అందించి వారి పెండింగ్ సమస్యలను పరిష్కరించనున్నారు.

అన్ని ఛార్జీలు భారం ప్రభుత్వానిదే : ఈ కార్యక్రమం ద్వారా అందించే సేవలను ప్రజలకు ఉచితంగా అందించటానికి అన్ని రకాల ఛార్జీలను ప్రభుత్వంమే భరించనుంది.దీనిలో భాగంగా క్యాంపులు నిర్వహించే తేదీని ప్రజలకు వాళ్ళ ఫోన్స్ కు మెసేజ్ పంపనున్నారు. అంతేకాకుండా పబ్లిక్ అనౌన్స్‌మెంట్స్, వాలంటీర్ల ద్వారా ముందుగా తెలియజేయబడుతుంది. దీని వల్ల ప్రజలు సచివాలయంలో ఉండే క్యాంపు వేదిక వద్ద వివిధ సేవలు, ధృవపత్రాలు మొదలైనవాటిని పొందడం ద్వారా ప్రయోజనం పొందుతారు.

మండల రెవెన్యూ అధికారులు, ఎంపీడీఓలు రోజంతా సచివాలయంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక శిబిరంలో కూర్చొని ఉండడంతో ప్రజలు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ, సర్వే, రెవెన్యూ సమస్యలపై చర్చించి పరిష్కరం పొందటానికి అవకాశం కలగనుంది.స్పందనతో పాటు జేకేసీ లో వచ్చిన ఫిర్యాదులు కూడా పరిష్కరించబడతాయి. అర్హులైన ప్రజలకు ఈ శిబిరంలో సర్టిఫికేట్లతో పాటు వివిధ సేవలను అందజేస్తారు.

ఇప్పటి వరకు ఏదైనా కారణం చేత ఏదైనా అర్హత కలిగిన వ్యక్తి పథకం నుండి తప్పించినట్లైతే, అటువంటి సమస్యలను ఈ క్యాంపులో పరిష్కరించబడతాయి. ప్రజలను సంతృప్తి పరిచే విధంగా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో సహాయపడతాయి.ఈ క్యాంపులో జారీ చేయబడిన ప్రతి సర్టిఫికేట్ పై వారి పథకం తాలుకా హోలోగ్రామ్ కలిగి ఉంటుంది.ఈ శిబిరం ద్వారా, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో సమర్ధవంతంగా పరిష్కరించడానికి, ప్రజలను చేరుకోవడానికి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తోంది, తద్వారా ప్రభుత్వ పాలనపై ప్రజల సంతృప్తిని మెరుగుపరచనుంది.

jaganannasuraksha
ఈ కార్యక్రమంపై గ్రామ వార్డు సచివాలయాల డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జీ.లక్ష్మి షా ఐఏఎస్ జగనన్న సురక్ష కార్యక్రమం అమలు చేయు వివరాలను తెలియజేసారు.
1. ఎంఆర్ఓ లేదా ఎంపీడీఓ ఆధ్వర్యంలో మండలాల్లో పట్టణ ప్రాంతాల్లో అధికార బృందాలను ఏర్పాటు చేయబడను.
2. ప్రతి బృందం రోజుకు ఒక సచివాలయాన్ని కవర్ చేయాలి.
3. మండల కార్యాలయం యొక్క సాధారణ పనితీరుకు అంతరాయం కలగకుండా మాత్రమే ప్రత్యామ్నాయ రోజు శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు.
4. మండలాలకు సగటు సచివాలయాల సంఖ్య 24గా ఉన్నాయి.
5. ఈ విధంగా అధికార బృందాలు 12 సెక్రటేరియట్‌లను నాలుగు వారాల్లో లేదా 3వ వారానికల్లా ఈ క్యాంపులను కవర్ చేయగలవు కాబట్టి, నాలుగు వారాల పాటు ఈ ప్రోగ్రామ్ వ్యవధిని నిర్ణయించారు. ఇంకా, ఏమైనా ఆంక్షలతో రద్దు చేసిన వివిధ పథకాలకు సంబంధించిన అభ్యర్థనలను పరిశీలించనున్నారు..

అలాగే సీఎంఓ అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు అందరికీ సమగ్ర శిక్షణను నిర్వహించారు. అనంతరం జిల్లా స్థాయి అధికారులు డివిజన్, మండల సిబ్బందికి శిక్షణను ఇచ్చారు. మండల స్టాఫ్ ఇంటర్నల్ సిబ్బందికి, సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్లకు వారం రోజుల పాటు శిక్షణను అందించినట్టు ఆయన వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+