ఓరయ్యా.. సామా.. ఏందిరా నాయనా.. ఇట్టుంది?
ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వర్షాకాలంలో ఇటువంటి ఎండలేంటంటూ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రుతుపవనాలు మందగించడంతో ఎండలు మొదలయ్యాయి. వారం రోజుల క్రితం వరకు చిరు జల్లులైనా కురుస్తూ ఉండేవి. కానీ గడిచిన మూడు రోజుల్లో భానుడి భగభగలకు వాతావరణం మొత్తం మారిపోయింది.
ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా వర్షాభావ పరిస్థితులు కనపడుతున్నాయి. ఎల్ నినో ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఎల్ నినో ఉంటే వేసవి కాలాన్ని సుదీర్ఘ సమయం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కోస్తా, రాయలసీమల్లో ఉక్కపోత పోస్తోంది. ఉత్తర కోస్తాలో ఎండలు మడుతున్నాయి. వర్షాకాలంలో ఈ తరహా వాతావరణం ఏర్పడటం అరుదని విశాఖపట్నం వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద్ అన్నారు.

ఉదయం 9.00 గంటల నుంచే ఎండ పెరుగుతోంది. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం బాపట్లలో 39 డిగ్లు నమోదైంది. సాధారణం కంటే 5.2 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. మరికొన్ని జిల్లాల్లో 35నుంచి 38 డిగ్రీల మధ్య ఉంటున్నాయి.
రాబోయే వారం రోజులు ఈ తరహా వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆగస్టు మొదటివారంలో అల్పపీడనాలు ఏర్పడి వర్షాలు విస్తారంగా కురియాల్సి ఉంది. కానీ అందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications