బిగ్ ట్విస్ట్, పీకేతో టచ్ లో చంద్రబాబు - దీదీ ఎంట్రీ, ఏం జరుగుతోంది..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుకు రానున్న ఎన్నికలు నవ్ ఆర్ నెవర్ అన్నట్లుగా మారాయి. దీంతో పొత్తులతో పాటుగా అన్ని మార్గాలను సద్వినియోగం చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో చంద్రబాబు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో అనూహ్యంగా టచ్ లోకి వెళ్లారని సమాచారం. ఇందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా రాయబారం నడుపుతున్నారని తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు బీజేపీ వైఖరిపై ఉత్కంఠ పెరుగుతోంది.

చంద్రబాబు కొత్త వ్యూహాలు : వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ను ఓడించేందుకు చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు పొత్తుల్లో పీకే (పవన్ కల్యాణ్) ను నమ్ముకున్న చంద్రబాబు..ఎన్నికల వ్యూహాల కోసం అనూహ్యంగా మరో పీకే (ప్రశాంత్ కిశోర్)వైపు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఒక జాతీయ పత్రిక ఆసక్తికర కథనం ప్రచురించింది.

Unexpected encounter: Chandrababu connects with Prashant Kishor, Didi Steps In what is BJPs strategy

2019 ఎన్నికల్లో జగన్ 151 సీట్లతో గెలుపు..టీడీపీని 23 సీట్లకు పరిమితం చేయటంలో నాడు రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కీలకంగా వ్యవహరించారు. జాతీయ రాజకీయ సమీకరణాల్లో భాగంగా ప్రశాంత్ కిశోర్ రాజకీయ వ్యూహకర్తగా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కేంద్రంలో మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు టీడీపీకి రాజకీయ వ్యూహకర్తగా పని చేస్తున్న రాబిన్ శర్మ గతంలో ప్రశాంత్ కిశోర్ తో కలిసి పని చేసారు.

పీకే సహకారం అందిస్తారా : వచ్చే ఎన్నికల్లో అధికారం టీడీపీకి కీలకంగా.. చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీంతో ప్రశాంత్ కిశోర్ సేవలు, సలహాల కోసం కనెక్ట్ అయ్యారు. దీని కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చొరవ తీసుకున్నట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. 2021 లో టీఎంసీ బెంగాల్ లో అధికారంలో రావటంలో పీకే కీలకంగా పని చేసారు.

తాజాగా చంద్రబాబు ఇటు బీజేపీతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నా.. బీజేపీ ముఖ్య నేతలు సీఎం జగన్ తో సన్నిహితంగా ఉండటంతో ఎన్డీఏలో తిరిగి చేయటం పైన తర్జన భర్జన పడుతున్నారు. ఈ సమయంలోనే ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న మమతా బెనర్జీ టీడీపీ అధినేతను తమ కూటమి వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

Unexpected encounter: Chandrababu connects with Prashant Kishor, Didi Steps In what is BJPs strategy

జగన్ వైపా..బాబు వైపా : కోల్ కతాలో టీడీపీ యువనేత నారా లోకేశ్ టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీతో కలిసి ప్రశాంత్ కిషోర్ ను కలిసినట్లుగా చెబుతున్నారు. గత నెలలో ఢిల్లీకి వెళ్లిన సమయంలో సీఎం జగన్ ప్రత్యేకంగా ప్రశాంత్ కిషోర్ మధ్య సమావేశం జరిగిందనే వాదన ఉంది. ప్రశాంత్ కిశోర రాజకీయ వ్యూహకర్త విధుల నుంచి తప్పుకున్నా.. సీఎం జగన్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు.

అటువంటి పీకే, సీఎం జగన్ ను కాదని చంద్రబాబుకు సహకారం అందిస్తారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఈ పరిణామాలను బీజేపీ నిశితంగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రానున్న రోజుల్లో ఏపీలో చోటు చేసుకొనే రాజకీయ సమీకరణాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+