AP Curfew New Timigs : మరిన్ని సడలింపులు- ఒకే టైమింగ్స్-మాస్క్ లేకపోతే 100
ఏపీలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ ఆంక్షల్లోనూ ఆ మేరకు మార్పులు చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకూ పలు జిల్లాల్లో భిన్నంగా అమలు చేస్తున్న సమయాలను మారుస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధంగా కర్ఫ్యూ సడలింపులు అమలు చేస్తారు.
ఏపీ సర్కార్ తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో ఏకీకృత కర్ఫ్యూ మినహాయింపులు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటివరకూ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మాత్రమే మినహాయింపులు ఇస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో మాత్రం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ మినహాయింపు ఇస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ రాత్రి కర్ఫూ మాత్రమే అమలు చేస్తున్నారు.

Recommended Video
తాజా మార్పుల ప్రకారం ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ మినహాయింపులు ఇస్తారు. అలాగే రాత్రి 9 గంటల వరకూ మాత్రమే షాపులు తెరిచేందుకు అనుమతి ఇస్తారు. 9 గంటల తర్వాత షాపింగ్ ముగించుకుని జనం రాత్రి 10 గంటల కల్లా ఇళ్లకు చేరుకోవాల్సి ఉంటుంది. మరోవైపు కరోనా వ్యాప్తి మరోసారి పెరగకుండా రోడ్లపై తిరిగే వారు మాస్కును తప్పనిసరిగా ధరించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తోంది. మాస్క్ లేకపోతే మాత్రం రూ.100 జరిమానా వసూలు చేస్తారు.












Click it and Unblock the Notifications