Union Budget 2022: ఊరట దక్కేనా - కరోనా వేళ ఉపశమనమిస్తారా : ఐటీ పరిమితి పెరిగేనా..!!

కరోనా పరిస్థితులు..ఆర్దిక ఇబ్బందుల్లో రాష్ట్రాలు.. వెసులు బాటు కోరుకుంటున్న సామాన్యులు..ఈ పరిస్థితుల్లో కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ తన చిట్టా పద్దులతో సిద్దమయ్యారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో 2022-23 వార్షిక బడ్జెట్ ను కేంద్ర మంత్రి ప్రవేశ పెట్టనున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న వేళ... కేంద్రంలో కరోనా పరిస్థితులు..భవిష్యత్ అంచనాల నడుమ నిర్మలమ్మ బడ్జెట్ పైన రాష్ట్ర ప్రభుత్వాలు..సామాన్యులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

కరోనా దెబ్బకు సంక్షోభం దిశగా

కరోనా దెబ్బకు సంక్షోభం దిశగా

కరోనా దెబ్బకు రెండేళ్ల కాలంలో పలు రాష్ట్రాల ఆర్దిక వ్యవస్థ సంక్షోభం అంచుల వరకూ వెళ్లింది. ప్రస్తుతం తిరిగి కరోనా పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. దీంతో.. పలు రంగాలు తమకు ఊరటనిచ్చే ప్రతిపాదనలు..ఉపశమన చర్యలు ఉంటాయనే ఆశతో కనిపిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ వైపు వ్యాపార - పారిశ్రామిక వర్గాలు ఎన్నో అంచనాలతో ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇక, సామాన్యులు సైతం ఈ సారి బడ్జెట్ తమకు ఎంతో కొంత ఊరటనిచ్చే స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నారు.

80 సీ మినహాయింపు పెరిగేనా

80 సీ మినహాయింపు పెరిగేనా

ముఖ్యంగా 80సీ కింద మినహాయింపుల పెంపుపై వేతన జీవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.కరోనా కారణంగా మారిన పరిస్థితులు, పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ కింద గరిష్ఠంగా ఇస్తున్న రూ.1.50 లక్షల మినహాయింపుల పరిమితిని రూ.3 లక్షలకు పెంచాలని వేతన జీవులు, ఆర్థిక నిపుణులు కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

దీనికితోడు ప్రామాణిక మినహాయింపుల (స్టాండర్డ్‌ డిడక్షన్‌)ను మరో రూ.50వేల మేర పెంచితే వేతన జీవులకు కొంత మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక, ఇదే సమయంలో 80 సీ కింద మినహాయింపుల విషయంలోనూ ఈ సారి బడ్జెట్ లో నిర్ణయాలు ఉంటాయనే చర్చ బలంగా వినిపిస్తోంది.

Recommended Video

    Union Budget 2022: All You Need To Know About The Schedule | Oneindia Telugu
    సామాన్యులకు దక్కే ప్రయోజనాలేంటి

    సామాన్యులకు దక్కే ప్రయోజనాలేంటి

    గతంలో ఇదే రకమైన మినహాయింపులతో పొదుపు పధకాల్లో పెద్ద ఎత్తున పెట్టబడులు వచ్చిన విషయాన్ని నిపుణలు గుర్తు చేస్తున్నారు. 80 సీ కింద ప్రస్తుతం ఉన్న రూ 1.50 లక్షల మినహాయింపును రూ 3 లక్షల వరకు పెంచితే వేతన జీవులకు ఈ పరిస్థితుల్లో ఉపశమనం లభిస్తుందని సూచిస్తున్నారు. కొవిడ్‌ కారణంగా మారిన పని వాతావరణం, పెరిగిన ద్రవ్యోల్బణంతో వేతనజీవులు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు.

    ఇలాంటి సమయంలో చిన్నస్థాయి మినహాయింపులిస్తే ఇంటి నిర్వహణ ఖర్చులో కొంత ఊరట దక్కుతుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర బడ్జెట్ లో ఎటువంటి చిట్కాలు నిర్మలా సీతారామన్ ప్రయోగిస్తారు.. ఎటువంటి ఉపశమన నిర్ణయాలు ప్రకటిస్తారనే ఆశ.. ఉత్కంఠ నడుమ దేశ వ్యాప్తంగా కేంద్ర బడ్జెట్ వైపు చూస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+