అమరావతికి ప్రధాని మోదీ ప్రత్యేక వరం..!!
ప్రధానిగా మోదీ కొత్త రికార్డు నెలకొల్పారు. ఇదే రోజున ఏపీ రాజధాని అమరావతికి ప్రత్యేక వరం ప్రకటించారు. ఏపీ విషయంలో కేంద్రం ఈ సారి ప్రత్యేక శ్రద్ద చూపిస్తోంది. పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతోంది. రాజధానికి ఆర్దికంగానూ తోడ్పాటు అందిస్తోంది. ఇదే సమయంలో ఏపీ రాజధాని కేంద్రంగా మరో రెండు కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్న సమయంలో.. అమరావతి విషయంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మరింత ప్రయోజనకరంగా మారనుంది.
ప్రధానిగా మోదీ 4,399 రోజుల పాలనతో కొత్త రికార్డు నెలకొల్పారు. ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో కేబినెట్ సహచరులు లేచి నిలబడి చప్పట్లతో 'స్టాండింగ్ ఒవేషన్' ఇచ్చారు. ప్రధానిని అభినందిస్తూ తీర్మానం చేసారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి మరో రెండు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో అమరావతిలో 5.35 ఎకరాల్లో రూ.1,299 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వ ఆఫీస్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. స్మార్ట్ సిటీ రూపకల్పనలో భాగంగా ఆధునిక సౌకర్యాలతో నిర్మించే ఈ కాంప్లెక్స్ ద్వారా రాష్ట్రంలో కేంద్ర నిధులు, కార్యాలయాల సమన్వయం మరింత సులభతరం కానుందని అధికారులు తెలిపారు. అదే విధంగా.. మరో 17 ఎకరాల్లో రూ.1,235 కోట్ల వ్యయంతో కేంద్ర ఉద్యోగుల కోసం గృహ సముదాయం నిర్మించేందుకూ ఆమోదముద్ర వేసింది.

కేంద్ర కేబినెట్ లో నిర్ణయం
ఇప్పటికే కేంద్రం అమరావతి విషయంలో సానుకూలంగా స్పందిస్తోంది. అమరావతికి ప్రపంచ బ్యాంకు నుంచి రూ 15 వేల కోట్ల రుణం మంజూరుకు సహకరించింది. అదే విధంగా కేంద్ర సంస్థల ద్వారానూ తోడ్పాటు అందిస్తోంది. పోలవరంతో పాటుగా రైల్వే, జాతీయ రహదారుల విషయంలోనూ ఏపీకి ప్రాధాన్యత ఇస్తోంది. కాగా, సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఇప్పటికే సీఆర్డీఏ 22.53 ఎకరాలు సేకరించింది. ఇందులో 5.53 ఎకరాల్లో కేంద్ర సచివాలయం, 17 ఎకరాల్లో నివాస సముదాయం నిర్మాణం కు నిర్ణయించారు. ఈ ప్రతిపాదనల ఆమోదం కోసం సీఆర్డీఏ అధికారులు ప్రభుత్వం ద్వారా ప్రయత్నాలు కొనసాగించారు. కాగా.. ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీలోనే ఉన్నారు. ఈ సమయంలోనే కేంద్ర కేబినెట్ అమరావతి కేంద్రంగా ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది.












Click it and Unblock the Notifications