వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగంలోకి సుజనా: పార్లమెంట్‌లో జైట్లీ ప్రకటన చేసే అవకాశం?

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ రాష్ట్రానికి కేంద్రం నుండి బడ్జెట్ కేటాయింపుల విషయమై టిడిపి ఎంపీల ఆందోళనలు ఉభయ సభల్లో కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి సుదీర్ఘంగా శుక్రవారం నాడు మంతనాలు చేశారు. మరోసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఏపీకి కేటాయింపుల విషయమై ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

బిజెపితో తాడోపేడో, నిరసనలు మరింత తీవ్రం: బాబు ఆదేశం బిజెపితో తాడోపేడో, నిరసనలు మరింత తీవ్రం: బాబు ఆదేశం

ఏపీ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపుపై ఏపీ ఎంపీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో ఏపీకి చెందిన అన్ని పార్టీల ఎంపీలు పార్లమెంట్ ఉభయసభల్లో తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు.

బడ్జెట్ ఎఫెక్ట్: ఎంతో కాలం మోసం చేయలేరు,అరుణ్ జైట్లీతో సుజనా వాగ్వాదం బడ్జెట్ ఎఫెక్ట్: ఎంతో కాలం మోసం చేయలేరు,అరుణ్ జైట్లీతో సుజనా వాగ్వాదం

బిజెపి వ్యవహరిస్తున్న తీరుపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడకూడదని చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలను ఆదేశించారు.

అంతా అయిపోయింది, చిన్న చూపు, ఏం చేద్దాం?: టిడిపి ఎంపీలు అంతా అయిపోయింది, చిన్న చూపు, ఏం చేద్దాం?: టిడిపి ఎంపీలు

పార్లమెంట్లో జైట్లీ మరోసారి ప్రకటన చేసే అవకాశం

పార్లమెంట్లో జైట్లీ మరోసారి ప్రకటన చేసే అవకాశం

ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో అన్యాయం జరగడంపై టిడిపి ఎంపీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో పాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి చర్చించారు. దీంతో మరోసారి కేంద్రం నుండి ఏపీకి కేటాయింపుల విషయమై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉంది.

కేంద్రం నుండి నిధుల విషయమై సుజనా డిమాండ్

కేంద్రం నుండి నిధుల విషయమై సుజనా డిమాండ్

ఏపీ ప్రజలు ఏం కోరుకొంటున్నారు, ఏపీకి రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హమీలు ఏ మేరకు కేంద్రం నుండి నిదులు కేటాయించారనే విషయమై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో సుజనా చౌదరి చర్చించారు. పార్లమెంట్‌లో జైట్లీ ఏ ఏ అంశాలపై ప్రకటన చేయాలనే విషయమై జైట్లీతో సుజనా చర్చించారు.ముఖ్యంగా ఏపీకి రావాల్సిన నిధులు, ప్యాకేజీ చట్టబద్దత విషయాలపై నిశితంగా చర్చించారని సమాచారం.

పార్లమెంట్ వేదికగా టిడిపి నిరసన

పార్లమెంట్ వేదికగా టిడిపి నిరసన

బడ్జెట్లో ఏపీకి నిధుల కేటాయింపు విషయమై అన్యాయం జరిగిందని టిడిపి ఎంపీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు..కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టిడిపి భాగస్వామిగా ఉంది. కానీ, ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై అన్యాయం జరిగిందని టిడిపి నిరసనలను వ్యక్తం చేస్తోంది. దీంతో బిజెపి నేతలు కూడ టిడిపి వైఖరిపై ఒకింత అసంతృప్తితో ఉన్నారు.అయినా తమ రాష్్రానికి అన్యాయం జరగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే టిడిపి నిరసనలు వ్యక్తం చేస్తోంది.

నిధులు, ప్యాకేజీ చట్టబద్దతపై చర్చ

నిధులు, ప్యాకేజీ చట్టబద్దతపై చర్చ

ముఖ్యంగా ఏపీకి రావాల్సిన నిధులు, ప్యాకేజీ చట్టబద్దత విషయాలపై నిశితంగా చర్చించినట్లు తెలుస్తోంది. జైట్లీ, అమిత్ షా నుంచి సానుకూలంగా స్పందన వచ్చినట్లు తెలుస్తోంది.రెండు సార్లు ప్రకటన చేసినప్పటికీ సంతృప్తి కలిగించలేదని సుజనా మంత్రులకు వివరించారు. దీంతో మరోసారి ప్రకటనకు కేంద్రమంత్రి సిద్ధమయ్యారు.

English summary
union finance minister Arun jaitley will statement on budget allocations to Andhra Pradesh state in Parliment on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X