శుభవార్త: ఏపీలోని రైతులకు రూ.1.60 లక్షలు... ఇలా అప్లై చేయండి

ఏపీలో కొలువుదీరిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం రైతులకు సంక్షేమ పథకాలను అమలు చేయడంతోపాటు వారికి అవసరమైన అన్నిరకాల సహాయక చర్యలను ఎప్పటికప్పుడు అందజేస్తోంది. తాజాగా రాష్ట్రంలోని రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పశు కిసాన్ క్రెడిట్ కార్డులను తీసుకువచ్చింది. రాష్ట్రంలో ఎంతోమంది రైతులు పశుపోషణ చేస్తున్నారు. వాటికి అవసరమైన దాణా కొనుగోలుతోపాటు పశువులను కొనుగోలు చేసేందుకు ఆర్థిక ఇబ్బందులవల్ల వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటివారిని ఆదుకునేందుకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులను కేంద్రం తీసుకువచ్చింది.

పశు సంవర్థక శాఖ కు చెందిన అధికారులు, సిబ్బంది సంబంధిత బ్యాంకు యాజమాన్యంతో సమన్వయం చేసుకొని అర్హులైన రైతులకు వీటిని మంజూరు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వీటిని జారీచేయగా, మరికొన్ని జిల్లాల్లో జారీచేయాల్సి ఉంది. ఈ క్రెడిట్ కార్డులద్వారా బ్యాంకులు రైతులకు రూ.1.60 లక్షల వరకు ఇస్తాయి. అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకొని పాల విక్రయాన్ని పెంచుకోవాలి. వాటి ఆదాయంద్వారా వచ్చిన డబ్బును తిరిగి 40 రోజుల్లోగా చెల్లించడానికి అవకాశం ఉంది. ఇలా 40 రోజుల్లోనే చెల్లించడంవల్ల వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. వీటిద్వారా అదనపు పశువులను కూడా కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ కార్డులతో ఆన్ లైన్ చెల్లింపులు చేయవచ్చు. జాగ్రత్తగా ఉపయోగించుకుంటే ఎటువంటి వడ్డీ భారం లేకుండా ఆర్థిక అవసరాలన్నీ తీరతాయి.

union government giving Pashu Kisan credit cards to farmers in AP

40 రోజులు దాటితే ఏడు శాతం వడ్డీ2
40 రోజుల దాటిన తర్వాత చెల్లిస్తే ఏడుశాతం వడ్డీని వసూలు చేస్తారు. అందులో మూడు శాతం ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. అంటే రైతు కేవలం నాలుగు శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. కేంద్ర ప్రభుత్వం పశు కిసాన్ క్రెడిట్ ద్వారా రూ.3 లక్షల రుణాన్ని నాలుగు శాతం వడ్డీకి అందజేస్తోంది. ఇందులో రూ.1.6 లక్షల వరకు ఎటువంటి హామీ అవసరంలేదు. రైతులకు ఎప్పుడు డబ్బులు అవసరమైతే అప్పుడు అతి తక్కువ వడ్డీ ధరలకు చాలా సులువుగా వీటిద్వారా రుణాలను పొంది ఉర్థికంగా ఉపశమనం పొందొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+