ఎన్నికల వేళ ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది. సీఎం జగన్ ఎన్నికల వేళ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనా పరంగా కొత్త అడుగులు వేస్తున్నారు. తాను అమలు చేస్తున్న సంక్షేమం తిరిగి తనకు అధికారం తెచ్చి పెడుతుందనే నమ్మకంతో జగన్ ఉన్నారు. ఇదే సమయంలో ఎన్నికల వేళ మరిన్ని ముఖ్య నిర్ణయాల పైన ఆలోచన చేస్తున్నారు. ఆర్దికంగా వెసులుబాటు పైన చర్చ సాగుతోంది. ఈ సమయంలోనే కేంద్రం ఏపీకి ఆర్దికంగా తోడ్పాటు అందించే నిర్ణయం ప్రకటించింది.

కేంద్రం రాష్ట్రాల పన్నుల వాటా విడుదల చేసింది. నవంబర్ నెలకు సంబంధించి రాష్ట్రాలకు రూ 72,961.21 కోట్లు పంపిణీ చేసింది. ఇందులో ఆంధప్రదేశ్ కు రూ 2,952.74 కోట్లు విడుదల అయ్యాయి. తెలంగాణ కు రూ1,533.64 కోట్లు దక్కాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ కు రూ 13,088.51 కోట్లు విడుదలయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో బీహార్ (రూ 7,338 కోట్లు), మధ్యప్రదేశ్ రూ 5,727 కోట్లు, పశ్చిమ బెంగాల్ రూ 5,488 కోట్లు ఉన్నాయి. దక్షిణాదిలోని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటకకు రూ 2,660.88 కోట్లు, కేరళ రూ 1,404.50 కోట్లు, తమిళనాడు కు రూ 2,976.10 కోట్లు కలిపి మొత్తంగా రూ 11,527.86 కోట్లు విడుదల చేసారు. కాగా, ఒక్క, ఉత్తరప్రదేశ్ కు అంతకంటే 13.53 శాతం మొత్తం ఎక్కువ దక్కింది.

Union Government has authorised the release of tax devolution of Re 2,952.,74 cr for Andhra Pradesh

ఏపీలో వరుస సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాజకీయంగా రానున్న అయిదు నెలల కాలం కీలకంగా మారుతోంది. ఈ నెలలో నవరత్నాల్లో భాగంగా రెండు పథకాలకు నిధులు విడుదల చేయాల్సి ఉంది. వచ్చే నెల నుంచి ఫిబ్రవరి ప్రభుత్వం ఇప్పటికే పథకాల అమలుకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఇదే సమయంలో ఉద్యోగుల పెండింగ్ బకాయిలతో పాటుగా పీఆర్సీ పైన కసరత్తు జరుగుతున్న వేళ.. ఐఆర్ ప్రకటన చేస్తారని ఉద్యోగలు ఆశగా ఎదురు చూస్తున్నారు. దీంతో, రానున్న అయిదు నెలల కాలం ఆర్దికంగా ఏపీకి కీలక సమయం. ఇక, ఎన్నికల సమయంలో తీసుకొనే నిర్ణయాలు సాధారణంగానే ఉంటాయి. దీంతో..ఆర్దికంగా ఆచి తూచి వ్యవహరించాల్సిన వేళ కేంద్రం నుంచి నిధుల విడుదల ఏపీ ఆర్దిక శాఖకు ఉపశనమంగా మారనుంది. కేంద్రం పన్నుల వాటాలో రాష్ట్రాలకు దక్కాల్సిన వాటా ఇవ్వటమే సాధారణమే అయినా..ఏపీలో ఎన్నికల వేళ ఆర్దికంగా ఇది కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+