పురంధేశ్వరీ షాక్: 'అలా అనలేదు, కేంద్రంపై ఏపీ తప్పుడు ప్రచారం''

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరీ ఆరోపించారు.
కేంద్రంతో సరైన రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని ఆమె రాష్ట్రానికి హితవు పలికారు.

ఏపీ రాష్ట్రానికి చెందిన కొందరు బిజెపి నేతలు వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. టిడిపి పొత్తు పెట్టుకోవడం వల్ల రాజకీయంగా నష్టమనే అభిప్రాయంలో ఆ పార్టీ నేతలు అభిప్రాంయతో ఉన్నారు.

అయితే ఎన్నికల సమయంలో పొత్తులపై నిర్ణయం ఉంటుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించారు. అయితే ఎన్నికల వరకు టిడిపితో పొత్తు ఉంటుందని ఆయన ప్రకటించారు.

పోలవరం ప్రాజెక్టు విషయంతో పాటు ఇతర అంశాలపై కొందరు బిజెపి నేతలు టిడిపి తీరును తప్పుబడుతున్నారు. ఈజీఎస్ నిధుల విషయంలో బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై గతంలోనే వైసీపీ ఎంపీలు కూడ ఫిర్యాదు చేశారు. ఈ విషయమై వైసీపీ బాటలోనే బిజెపి పయనించకూడదని టిడిపి నేతలు హితవు పలికారు.

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం కట్టుబడి ఉంది

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం కట్టుబడి ఉంది

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని మాజీ కేంద్రి పురంధేశ్వరి చెప్పారు.కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆమె ఆరోపణలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అలా వ్యవహరిస్తోందో అర్ధం కావడం లేదన్నారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవహరశైలి సక్రమంగా లేదన్నారు.పోలవరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో పాటు జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్జిత్ సింగ్‌ను కలిసినట్లు పురంధేశ్వరి చెప్పారు.

కేంద్రంపై రాష్ట్రం తప్పుడు ప్రచారం

కేంద్రంపై రాష్ట్రం తప్పుడు ప్రచారం

కేంద్ర ప్రభుత్వంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని పురంధేశ్వరీ చెప్పారు.కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టొద్దని బీజేపీ ఎక్కడా చెప్పలేదని ఆమె గుర్తు చేశారు. కానీ చాలా చోట్ల కాపర్ డ్యాం లేకుండానే ప్రాజెక్ట్ లు కట్టారని చెప్పారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పురంధేశ్వరి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపుపై రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎలాంటి సమాచారం వెళ్లలేదని పురంధేశ్వరీ ఆరోపించారు.

వేర్వేరు అకౌంట్లు తెరిస్తే డబ్బులు

వేర్వేరు అకౌంట్లు తెరిస్తే డబ్బులు

పోలవరం ప్రాజెక్టు పనులు చేపడుతున్న కంపెనీలకు వేర్వేరు అకౌంట్లను తెరిస్తే ఎవరికి చెల్లించాల్సిన డబ్బు వారికి చేరుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే సాంకేతిక నిపుణుల బృందం పరిశీలించి నివేదిక ఇచ్చాక కాఫర్ డ్యాంపై నిర్ణయం తీసుకుంటామన్నారని పురంధేశ్వరీ చెప్పారు.

రూ.3వేల కోట్ల నిధులివ్వాలి

రూ.3వేల కోట్ల నిధులివ్వాలి

కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఏపీ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లేఖ రాశారు. రాష్ట్రానికి రావాల్సిన రూ. 3వేల కోట్ల పెండింగ్ నిధులను విడుదల చేయాలని ఆ లేఖలో కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో పదవి ఖాళీగా ఉన్నందున పనులకు ఆటంకం కలుగుతోందని, సీఈవో పోస్టుకు అదనపు కార్యదర్శి స్థాయి వ్యక్తులు లభించనందున జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారితో భర్తీ చేయాలని ఆ లేఖలో చంద్రబాబు కోరారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former union minister Purendheshwari made allegations on Ap governament on Tuesday. She spoke to media on Tuesday at Vijayawada. she said that Union government ready to give money for Polavaram project.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి