రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!
రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్దికంగా వెసులుబాటు కలిగించే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్లమెంట్ సమావేశాల్లో కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే పీఎం కిసాన్ ద్వారా ప్రతీ ఏటా రైతులకు రూ 6 వేలు కేంద్రం అందిస్తోంది. ఇదే సమయంలో రైతుల రుణ పరిమితి పెంపు పైనా సానుకూల నిర్ణయం తీసుకుంది. దీంతో, ఇక నుంచి రైతులకు ఆర్దికంగా మరింత తోడ్పాటు అందుతుందని కేంద్రం పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా కీలక ప్రకటన చేసింది. రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా స్వల్పకాలిక వ్యవసాయ రుణ పరిమితిని రూ.3లక్షల నుంచి రూ. 5లక్షలకు పెంపుదల చేస్తూ 2025-26 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖా సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. 2022 - 23 వార్షిక సంవత్సరం నుంచి పూర్తి వివరాలు ను లిఖిత పూర్వకంగా తెలిపిన మంత్రి సంబంధిత డేటాలో 2024-25 వార్షిక సంవ త్సరానికి ఆంధ్ర ప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో మొత్తంగా 66,37,482 కిసాన్ క్రెడిట్ కార్డు ఖాతాలు ఉన్నట్లు తెలిపారు. ఆయా ఖాతాల ద్వారా రూ. 84522 కోట్ల మేర రుణాలను అందించడం జరిగిందన్నారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 6,73,570 కార్డులు(ఖాతాలు) ఉండగా వాటి ద్వారా రూ.10134 కోట్ల మేర రుణాల రూపంలో ఇవ్వడం జరిగిందని తెలిపారు.

కేంద్రం తాాజా నిర్ణయంతో రైతులకు బిగ్ రిలీఫ్
ఎన్టీఆర్ జిల్లాలో 1,94154 ఖాతాలు ఉండగా రూ.1677 కోట్ల మేర రుణాలను అందించడం జరిగిందని వివరించారు. సవరించిన వడ్డీ రాయితీ పథకం ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలిపి రూ.69420.99 కోట్లు రుణాలను 2024-25 ఏడాదికి విడుదల చేయగా అదే ఏడాది ప్రాంప్ట్ రీపేమెంట్ ఇన్సెంటివ్ కింద రూ.595.38 కోట్ల మేర చెల్లింపులు చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎసఎల్‌బీసీ), ఆంధ్రప్రదేశ్ ప్రరభుత్వ నివేదిక ప్రకారం జిల్లాల వారీగా కిసాన్ క్రెడిట్ కార్డ్‌లు (కెసీసీ) జారీ చేయబడిన సంఖ్య , రుణాలు పంపిణీ చేయబడిన మొత్తం వివరాలు, కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న రుణాల వివరాలను మంత్రి వెల్లడించారు. కాగా, పీఎం కిసాన్ తో పాటుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కేంద్రం ఇస్తున్న రూ 6 వేలకు అదనంగా మరో రూ 14 వేలు అందిస్తోంది. ఇక.. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం తో రైతాంగానికి ఆర్దికంగా ప్రయోజన కరంగా మారనుంది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!













Click it and Unblock the Notifications