ఏపీలో కొత్త లోక్‌సభ స్థానాలు ఫిక్స్, లిస్టులో అమరావతి సహా ఇవే - ఈ సీట్ల రద్దు...!!
ఏపీలో కొత్త లోక్‌సభ నియోజకవర్గాల పై కేంద్రం స్పష్టత వచ్చింది. ప్రస్తుతం ఉన్న 25 స్థానాలు డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే వీటి సంఖ్య 38కి చేరనుంది. దీంతో. కొత్త లోక్‌సభ నియోజక వర్గాల ఏర్పాటు లో కేంద్రం అమలు చేయనున్న మార్గదర్శకాల ఆధారంగా కొత్తగా ఏర్పడనున్న ఎంపీ స్థానాలు ఎక్కడెక్కడ అనేది క్లారిటీ వస్తోంది. అందులో అమరావతి సహా పలు ప్రాంతాలను కొత్త ఎంపీ స్థానాలుగా మారనున్నాయి. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న సీట్లలో కొన్ని రద్దయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
కేంద్రం ప్రస్తుతం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన డీలిమిటేషన్ బిల్లు ద్వారా ప్రతీ రాష్ట్రంలో 50 శాతం లోక్‌సభ .. అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయి. ప్రస్తుతం అందుతున్న లెక్కల మేరకు ఏపీలో సగటున ఒక్కో లోక్‌సభ నియోజకవర్గ జనాభా 13.02 లక్షలు కానుంది. ప్రస్తుతం కొన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో జనాభా 20 లక్షలకు పైగా ఉంది. కొత్ నియోజక వర్గాల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. రాజధాని అమరావతి కేంద్రంగా కొత్త లోక్‌సభ నియోజకవర్గం ఏర్పాటు కానుంది. అదే విధంగా గతంలో లోక్‌సభ నియోజకవర్గ కేంద్రాలుగా వెలిగిన తెనాలి, గుడివాడ, మార్కాపురం, బొబ్బిలి వంటి స్థానాలు తిరిగి ఏర్పడే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రం యూనిట్‌గా 2011 జనాభా లెక్కల ప్రకారం విభజన చేస్తే ఒక్కో లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సగటున 13.02 లక్షల మంది జనాభా ఉంటారు. తిరుపతి, ఒంగోలు, గుంటూరు ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో ఎంపీ స్థానం మేర పెరగనుంది. అదే విధంగా కొత్త ఎంపీ స్థానాలు ఈ సారి రాయలసీమ లో కొత్త రూపు సంతరించుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.

అమరావతి కేంద్రంగా కొత్త స్థానం
తాజాగా జరిగే పునర్విభజన లో దశాబ్దాల కిందటే ఏర్పాటైన నియోజకవర్గాల పైన సమీక్ష చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పెనుకొండ, కావలి, మార్కాపురం, ఆదోని కేంద్రాలుగా లోక్‌సభ నియోజకవర్గాలు ఉండేవి. తాజా పునర్విభజనలో బొబ్చిలి, తెనాలి తిరిగి పరిశీలించే అవకాశాలు ఎక్కువున్నాయి. కాగా.. అమరావతి కేంద్రంగా ఎంపీ స్థానం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో బాపట్ల, గుంటూరు, నర్సరావుపేట ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ జిల్లాలో ఒకటి నుంచి రెండు స్థానాల వరకు పెరుగుతాయి. అందులో అమారావతి ఒక స్థానం ఏర్పాటు కావటం ఖాయమని సమాచారం. అదే విధంగా ప్రస్తుతం ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అవి 263 కి పెరగనున్నాయి. ఇక.. 2009 లో నియోజక వర్గాల పునర్విభజనలో భాగంగా తెలంగాణలో సీట్లు పెరిగి.. ఏపీలో తగ్గాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, ప్రకాశం తదితర జిల్లాల్లో కొన్ని స్థానాలు రద్దయ్యాయి. దీంతో.. ఈ జిల్లాల్లో తిరిగి సీట్లు పెరుగుతాయనే చర్చ సాగుతోంది. కేంద్రం ఏర్పాటు చేసే డీలిమిటేషన్ కమిటీ నియోజక వర్గాల పెంపు..ఖరారు పైన అభిప్రాయ సేకరణతో ఇచ్చే నివేదిక కీలకం కానుంది.













Click it and Unblock the Notifications