వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమరావతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజధాని అమరావతి మార్చే ఆలోచనలో జగన్ సర్కార్ ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు విషయమై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య చేశారు .అమరావతిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈరోజు హైదరాబాద్‌లో సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీలో రూ.150 కోట్లతో కొత్త బ్లాక్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడారు.

బీజేపీ నెక్స్ట్ టార్గెట్ నిజామాబాద్.. రైతు కష్టాలు అందుకే? కొత్త సెంటిమెంట్‌కు తెరతీస్తున్న ఎంపీ! బీజేపీ నెక్స్ట్ టార్గెట్ నిజామాబాద్.. రైతు కష్టాలు అందుకే? కొత్త సెంటిమెంట్‌కు తెరతీస్తున్న ఎంపీ!

బుధవారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి అమరావతిపై నెలకొన్న తాజాపరిస్థితుల నేపధ్యంలో స్పందించారు . ఈ అంశం కేంద్రం పరిధిలోకి రాదన్నారు. కేంద్రం ఈ అంశామపై ఎలాంటి నిర్ణయం తీసుకోదని ఆయన చెప్పారు. హైద్రాబాద్‌ను దేశానికి రెండో రాజధాని అంటూ వస్తున్న వార్తల్లో కూడ వాస్తవం లేదన్నారు కిషన్ రెడ్డి . ఇక తెలంగాణా సీఎం కేసీఆర్ పై విరుచుకుపడిన కిషన్ రెడ్డి ,తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ కార్యక్రమం అంత గొప్ప కార్యక్రమమైతే ప్రజలు ఎందుకు ధర్నాలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతల తీరు మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. ఏడు లోక్ సభ సీట్లలో ఓటమి తరువాత టీఆర్ఎస్ నేతలకు మతిభ్రమించిందని ఆయన వ్యాఖ్యానించారు.ఆయన మంత్రిగా ఉన్న తెలంగాణ ఎంపీలతో పాటు కేటీఆర్ కూడా ఆయనను కలిశారని గుర్తు చేశారు. ఆయనెవరో తెలీదని చెప్పటం అహంకారపూరిత చర్య అని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Union minister Kishan Reddy made interesting comments on Amravati

జేపీ నడ్డా ఎవరో తెలియదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించడంపై ఆయన మండిపడ్డారు . నిజామాబాద్ ఎంపీ స్థానంలో కవిత ఎందుకు ఓటమి పాలైందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ లేకపోతే రాష్ట్రంలో నాలుగు ఎంపీ స్థానాల్లో బీజేపీ ఎలా విజయం సాధించిందని ఆయన ప్రశ్నించారు. 2023లో తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడమే తమ ముందున్న కర్తవ్యమన్నారు కిషన్ రెడ్డి .

English summary
On Wednesday, Union Home Minister Kishan Reddy responded to the latest situation in Amravati. This issue is not covered by the Center. He said the Center would not take any decision on this issue. Kishan Reddy said that there is no truth in the news that Hyderabad is the second capital of the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X