ఏప్రిల్ 1న ఏపీకి...కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాక
అమరావతి :కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏప్రిల్ 1 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నారు. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర మంత్రి గడ్కరీ రాష్ట్రానికి రాక ప్రాధాన్యత సంతరించుకుంది.
గడ్కరీ ఎపి పర్యటనలో భాగంగా కృష్ణా నదిలో భారీ ఫంటును ప్రారంభించనున్నారు. అనంతరం పోలవరం పనులను ఆయన పరిశీలిస్తారు. ఈ సందర్భంగా పోలవరంలో కొనసాగుతున్న పనుల గురించి కేంద్ర మంత్రి గడ్కరీకి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వివరించనున్నట్లు తెలిసింది. గడ్కరీ పోలవరం పర్యటనలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గొనే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.













Click it and Unblock the Notifications