చంద్రబాబు, రేవంత్ రెడ్డి మనవి, యోదీ ఆదేశాలు, రంగంలోకి కేంద్ర మంత్రి
భారీ వర్షాలు దెబ్బకి తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలను ఆదుకోవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు స్థానిక అధికారుల నుండి సమాచారం సేకరిస్తున్నారు.
విజయవాడలో వరదల కారణంగా జరిగిన నష్టంపై సీఎం చంద్రబాబు నివేదిక తెప్పించుకున్నారు. ఇక తెలంగాణలో కూడా చాలా జిల్లాలల్లో వరదల దెబ్బతో భారీ నష్టం జరగడంతో సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారుల నుంచి నివేదిక తప్పించుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేశారు.

ప్రధాన నరేంద్ర మోదీ ఆదేశాలతో గురువారం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విజయవాడ చేరుకున్నారు. విజయవాడతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అదే సమయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానిక ప్రజలు, రైతులతో మాట్లాడి వివరాలు సేకరించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత విజయవాడలో అధికారులతో ప్రత్యేక సమావేశం కానున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద నష్టం పై అధికారుల నుండి నివేదిక స్వీకరిస్తారని తెలిసింది.
శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణలోని పలు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు పర్యటించనున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి వేదిక సమర్పించనున్నారు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమర్పించింది ఆధారంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు అత్యవసర నిధులు మంజూరు చేసే అవకాశం ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications