దటీజ్ వైయస్ చౌదరి: జైట్లీ వెళ్లే సమయం చూసుకొని వెంటపడిన సుజనా చౌదరి!

పోలవరంకు ప్రాజెక్టుకు నాబార్డు నిధులు సోమవారం నాడు విడుదలయ్యాయి. ఈ ప్రాజెక్టుకు నిధుల విషయంలో సుజనా చౌదరి బాగా చొరవ చూపారని స్వయంగా కేంద్రమంత్రి ఉమాభారతి అన్నారు.

విజయవాడ: పోలవరంకు ప్రాజెక్టుకు నాబార్డు నిధులు సోమవారం నాడు విడుదలయ్యాయి. ఈ ప్రాజెక్టుకు నిధుల విషయంలో కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి బాగా చొరవ చూపారని స్వయంగా కేంద్రమంత్రి ఉమాభారతి అన్నారు.

ఈ నేపథ్యంలో సుజన పైన పలువురు నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. సుజనా కృషి ఉందని కేంద్రమంత్రులు అరుణ్‌ జైట్లీ, వెంకయ్య నాయుడు, ఉమాభారతిలు చెప్పారు. సుజనా కృషిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా కొనియాడారు.

ఆంధ్రప్రదేశ తరపున కేంద్ర ఆర్థిక, జలవనరుల శాఖలు, ఇతర విభాగాలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లారని చంద్రబాబు అన్నారు. జైట్లీ మాట్లాడుతూ.. సుజనా తనను వదిలి పెట్టలేదని, నిధులు ఇవ్వాలని పదేపదే కలసి చర్చించేవారన్నారు.

Union Ministers praise Sujana Choudhary

తాను ఎప్పుడు ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్తున్నానో తెలుసుకుని, సరిగ్గా ఆ సమయానికల్లా జైట్లీ వద్ద సుజనా చౌదరి ప్రత్యక్షమయ్యేవారని ఉమాభారతి చెప్పారు. సుజనాను, ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావును కూడా వెంకయ్య అభినందించారు. చిన్నవాడైనా ఉమ పోలవరంపై ఎంతో శ్రద్ధ తీసుకున్నారని, తన సీఎం లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+