రెండో రోజు సీమాంధ్ర బంద్: మంత్రుల ఇళ్ల ముట్టడి
హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో రెండో రోజు శనివారం బంద్ కొనసాగుతోంది. సీమాంధ్రలో కేంద్ర, రాష్ట్ర మంత్రుల ఇళ్ల ముట్టడికి ఆందోళనకారులు ప్రయత్నించారు. గుంటూరులో మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ నివాస ముట్టడికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు శనివారం ఉదయం యత్నించాయి. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్ర విభజనపై కేంద్ర తొందరపాటు చర్య వల్ల సీమాంధ్ర నష్టపోతోందని మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. శనివారం ఉదయం హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడారు. కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యమం సాగుతోందన్నారు. కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. గెలిపించిన ప్రజలే తమ ఇళ్లపై దాడులు చేస్తున్నారని చెప్పారు. విభజన శాస్త్రీయపద్దతిలో జరగలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వల్లే పరిస్థితి అదుపులో ఉందని, రాజీనామా చేసి వెళ్లిపోవాలని ఉందని, అయితే తీర్మానాన్ని ఓడిస్తామని మంత్రి శత్రుచర్ల స్పష్టం చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలో రాష్ట్ర విభ జనకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి పళ్లంరాజు ఇంటి ముట్టడికి ఎన్జీవోలు యత్నించారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్జీవోలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. స్వల్ప లాఠీచార్జి చేసి ఆందోళనకారులను పోలీసులు చెదురగొట్టారు.

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఇంటిని సమైక్యవాదులు ముట్టడించారు. మంత్రివర్గ నిర్ణయానికి వ్యతిరేకంగా మంత్రి పదవికి, పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్ారు.
సీమాంధ్రలోని పలు జిల్లాలో విద్యా, వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి. జాతీయ రహదారులను సమైక్యవాదులు దిగ్బంధించారు. విశాఖపట్నంలో రెండో రోజు బంద్ కొనసాగుతోంది. లంకెలపాలెం వద్ద హైవేను సమైక్యవాదులు దిగ్బంధించారు. విజయనగరం జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గణపతినగర్ మరుపల్లిలో సత్యస్టోన్ క్రషర్ ఆఫీసుకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పూసపాటిరేగ హైవేను సమైక్యవాదులు దిగ్బంధించారు.
కడప జిల్లాలో రెండో రోజు బంద్ జరుగుతోంది. ఆర్టీపీపీఎస్‌కు సమైక్య సెగ తగిలింది. ఉద్యోగులు రెండో రోజు ఆందోళనకు దిగారు. కర్నూలు జిల్లాలో రెండో రోజు బంద్ కొన సాగుతోంది. పలు రహదారులను సమైక్యవాదులు దిగ్బంధించారు. విద్యా, వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి. కృష్ణా జిల్లాలో రెండో రోజు బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బెంజ్‌సర్కిల్‌లో టీడీపీ, సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహించారు. ఎన్‌హెచ్5పై ఎన్జీవో-సమైక్యవాదులు ఆటాపాటా కార్యక్రమాన్ని నిర్వహించారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications