అసెంబ్లీలో రచ్చ రచ్చ-బాలయ్య సైగలకు తొడగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే-చంద్రబాబు చర్చకు సర్కార్ సై..
ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత చంద్రబాబు అరెస్టుపై చర్చకు టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని గందరగోళం సృష్టించారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు ఎత్తేయాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. స్పీకర్ వెల్ లో ఉన్న మానిటర్ ను లాగేసేందుకు ప్రయత్నించారు. అలాగే కాగితాలు చింపి విసిరేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
టీడీపీ సభ్యుల ఆందోళనపై స్పందించిన శాసససభా వ్యవహరాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. చంద్రబాబు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. దీంతో పాటు చాలా అంశాలపై చర్చకు సిద్ధంగా ఉందన్నారు. కానీ తగిన ఫార్మాట్ లో రావాలని టీడీపీ ఎమ్మెల్యేలకు సూచించారు. ముఖ్యంగా ఇవాళ బీఏసీ భేటీ జరగనున్ననందున అందులో ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుందామని సూచించారు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గలేదు.

అదే సమయంలో మంత్రి అంబటి రాంబాబు జోక్యం చేసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ బల్ల చరుస్తుండగా.. వెళ్లి కోర్టుల్లో బల్లలు చరవాలని వారికి సూచించారు. టీడీపీ సభ్యులు ప్రవర్తన తో సభలో అవాంఛనీయ ఘటనలు జరిగే ప్రమాదం ఉందని మంత్రి అంబటి తెలిపారు. మరోవైపు అంబటి మాట్లాడుతుండగా రండి చూసుకుందాం అంటూ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేతితో సైగ చేశారు. దీంతో అంబటి రా చూసుకుందాం అంటూ ప్రతిసవాల్ చేశారు.

బాలకృష్ణ సైగలతో వైసీపీ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. బాలకృష్ణ కు వ్యతిరేకంగా పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. బాలకృష్ణ సినిమాల్లో మీసం తిప్పుకోవాలి...

ఇక్కడ కాదని మంత్రి అంబటి సూచించారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బాలకృష్ణ ను చూస్తూ తొడ గొట్టారు. దీంతో సభో వాతావరణం పూర్తిగా అదుపు తప్పింది. చేసేది లేక స్పీకర్ తమ్మినేని సీతారాం సభను వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications