Unstoppable with NBK 2: రోజాను ఆహ్వానించిన బాలయ్య..అక్కడే ట్విస్ట్..!!
అమరావతి: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 టాక్ షోపై పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా..ఘాటు విమర్శలు చేశారు. మెగా కాంపౌండ్ హీరోలనూ వదల్లేదు. సినిమాల పరంగా వారికి మంచి ఆదరణే ఉన్నప్పటికీ- రాజకీయాల్లో ఏ మాత్రం రాణించలేరని అన్నారు. పవన్ కల్యాణ్, నాగబాబు ఎన్నికల్లో ఓడిపోవడమే దీనికి నిదర్శనమని రోజా గుర్తు చేశారు.

భయంతోనే..
తనపై మెగాస్టార్ చిరంజీవి చేసిన విమర్శలను రోజా తిప్పి కొట్టారు. మెగా ఫ్యామిలీలో ఆరేడు మంది హీరోలు ఉన్నారని, వారికి వ్యతిరేకంగా మాట్లాడితే సినిమా ఇండస్ట్రీలో అడ్రస్ లేకుండా చేస్తారనే భయంతో ఉన్నారే గానీ- ప్రేమాభిమానాలతో కాదని అన్నారు. మెగా ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీలో నిజంగా ప్రేమే ఉంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో వారు మద్దతు పలికిన ప్రకాష్ రాజ్ ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు.

ఎందుకు ఓడారు?
తనపై విమర్శలు చేసిన వాళ్లు కూడా ఒకసారి తమ గురించి ఆలోచించుకోవాలని రోజా సూచించారు. మంత్రులకు శాఖలే తెలీదంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. శాఖలే తెలియకుండా మంత్రులు ఎలా అవుతారని ప్రశ్నించారు. తనతో పాటు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన కోట శ్రీనివాసరావు, శారద, బాబు మోహన్ గెలిచారని, మెగా బ్రదర్స్ ఎందుకు ఓడిపోయారో ఆలోచించాలని చెప్పారు.

సరదా మనిషి..
నందమూరి బాలకృష్ణ సినిమాల్లో కంటే బయటే చాలా సరదాగా ఉంటారని రోజా పేర్కొన్నారు. ఫోన్లు పగులగొట్టడం, అభిమానుల చెంప పగులగొట్టడం వరకే ఆయనను చూసి ఉంటారని, ఆయనలో మరో కోణం ఉందని చెప్పారు. బాలకృష్ణ చాలా సరదా మనిషి అని అన్నారు. ఆయనతో ఏదైనా టాక్ షో ప్లాన్ చేస్తే సక్సెస్ అవుతుందని తాను ఎప్పుడో చెప్పానని అన్నారు. బాలకృష్ణ వల్లే అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే సక్సెస్ అయిందని పేర్కొన్నారు.

వారి రాకతో సినారియో మారిపోయింది..
అలాంటి షోనకు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, నారా లోకేష్, పవన్ కల్యాణ్ ను పిలిపించి తప్పు చేశారని రోజా వ్యాఖ్యానించారు. వీళ్లంతా వచ్చిన తరువాత సినారియో మొత్తం మారిపోయిందని, రాజకీయ వేదికగా మారిందని అన్నారు. ఎప్పుడో చనిపోయిన ఎన్టీఆర్ ను ఇప్పుడు ఫూల్ ను చేస్తోన్నారని చెప్పారు.

ఆహ్వానం అందినా..
కన్నతండ్రికి చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తోంటే సహకరించిన బాలకృష్ణ.. దాన్ని మళ్లీ తెర మీదికి తీసుకొచ్చి సమర్థించుకున్నట్టయిందని అన్నారు. ఇదంతా చూస్తోంటే- బాలకృష్ణకు తండ్రి మీద కంటే కూతురి కాపురం మీదే ఎక్కువ ఇంట్రస్ట్ ఉన్నట్టుందని రోజా చెప్పుకొచ్చారు. అన్‌స్టాపబుల్ షోలో పాల్గొనడానికి తనకు కూడా ఆహ్వానం అందిందని, ఎన్టీ రామారావు లాంటి మహా నటుడిని అవమానించిన ఆ షోలో పాల్గొనకూడదనే ఉద్దేశంతో తాను విరమించుకున్నానని అన్నారు.












Click it and Unblock the Notifications