Azadika Amrit Mahotsav: మా జీవగడ్డపై మీ పెత్తనమేంటి: తెల్లదొరలపై కన్నెగంటి కన్నెర్ర
దేశానకి స్వాత్యంత్ర సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తికాబోతోంది. గోల్డెన్ జూబ్లీ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఆజాదీకా అమృత్ మహోత్సవం పేరిట స్వాత్యంత్ర సమరయోధులను స్మరించుకునేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఈక్రమంలో దేశవ్యాప్తంగా గుర్తింపు నోచుకోని సమరయోధుల ఎంతోమంది ఉన్నారంటూ ఓ చర్చ తెరమీదకి వచ్చింది. అడవి పుల్లరిశాసనాన్ని దిక్కరించి అమరుడైన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కన్నెగంటి హనుమంతు ప్రస్తావన ప్రధానంగా వినిపిస్తోంది.ఆమహానీయున్ని జీవిత విశేషాలను తెలుసుకుందాం.
అల్లూరి సీతారామ రాజు కంటే ముందే బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడిన యోధుడు కన్నెగంటి హనుమంతు . ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా కోలగట్ల గ్రామం. తల్లిదండ్రులు వెంకటయ్య, అచ్చమ్మ దంపతుల ద్వితీయ సంతానం. హనుమంతు తల్లిదండ్రులతో పాటు అక్కడి ప్రజలు అడవులలో పుల్లలను ఏరుకోంటూ ..మేకలను, గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఈక్రమంలోనే బ్రిటీష్ ప్రభుత్వం అడవిలో పుల్లలు ఏరుకోవడం
మేకలపై నిషేధం విధించి.. అడవి పుల్లరి (సుంకం) చెల్లించాలని శాసనాన్ని ప్రవేశపెట్టింది. సుంకం చెల్లించకుండా మేపితే ఆ పశువులను బందెలదొడ్లకు తరలించడం, జప్తుచేయటం వంటి అనైతిక చర్యలకు పాల్పడింది.

మహాత్మా గాంధీ సహాయ నిరాకరోద్యమంతో ఉత్తేజితుడైన హనుమంతు పుల్లిరి ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకించాడు. అత్యంత శక్తివంతమైన బ్రిటిష్ పాలనా వ్యవస్థపై తన ధిక్కార స్వరం వినిపించాడు. "ఈ చెట్టు నువ్వు పెట్టావా? విత్తు నువ్వు పెట్టావా? నారు నువ్వు పోశావా? నీరు నువ్వు పెట్టావా? మా జీవగడ్డపై నీకేక్కడి నుంచి వచ్చింది పెత్తనం?" అంటూ పిడుగులాంటి ప్రశ్నల అస్త్రాన్ని సంధించాడు. వందల మంది యువకులను కలుపుకని తెల్లవారిపై దండయాత్రకు బయల్దేరాడు. పల్నాడు సీమలో కన్నెగంటి ప్రతాపానికి బ్రిటిష్ ప్రభుత్వం వణికిపోయింది. ఈక్రమంలో బ్రిటిష్ జనరల్ టి. జి. రూథర్ ఫర్డ్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వెర్నర్ కొంత మంది స్థానికులను చేరదీశాడు. కన్నెగంటి కదలికలు తెలుసుకొని ఆయనను మట్టు బెట్టాలని ప్రయత్నాలు చేసాడు.
హనుమంతుని లొంగదీసుకోవడం కోసం బ్రిటీష్ జనరల్ కరణం ద్వారా వర్తమానం పంపాడు. దుర్గి ఫిర్కకు జమిందార్ గా చేస్తామని..ఇష్టానుసారం శిస్తూ వసూలు చేసుకోమని హనుమంతుకు ఆఫర్ చేశాడు. కానీ కన్నెగంటి ఆఫర్ ని తిరస్కరించాడు. ఈక్రమంలోనే బ్రిటీష్ ప్రభుత్వ వైఖరితో విసుగుచెందిన అక్కడిప్రజలు తిరగబడి నిరాకరణోద్యమం చేపట్టి సుంకం చెల్లించకుండానే అడవుల్లో పశువులు మేపడం మొదలెట్టారు.జరిగటంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. దీంతో ఆగ్రహించిన అటవీశాఖ అధికారులు పశువులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా.. ప్రజలు ప్రతిఘటించడంతో చేసేదేమిలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇది కాస్తా ఉద్యమంగా మారి 1921 ఫిబ్రవరీ 16 వ తేదిన మంచాలపాడులో తీవ్ర ఘర్షణకు దారితీసింది.
Recommended Video

మొదటిసారిగా బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి కన్నెగంటి హనుమంతు నాయకత్వం వహించారు. ఉద్యమం చేస్తున్న గుంపును చెదరగొట్టడానికి పోలీసులు ప్రజలపై కాల్పులు జరిపారు. దీంతో భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా.. హనుమంతు మరో ఇద్దరు దైర్యంగా ముందుకు వచ్చి నిలబడ్డారు. అనంతరం హనుమంతుపై కాల్పులు జరపడంతో అక్కడిక్కడే ఆయన మరణించారు. ఈఉద్యమం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరుపురాని సంఘటనగా నిలిచిపోయింది.












Click it and Unblock the Notifications