మూణ్నెళ్లలో దిగిపోతారు, విభజన హక్కు లేదు: బాబు
విజయవాడ: మూడు నెలల్లో దిగిపోయే ప్రభుత్వానికి రాష్ట్రాన్ని విభజించే హక్కు లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు తుఫాను బాధితులను పరామర్శించడానికి వచ్చిన చంద్రబాబు బుధవారం ఆ విధంగా అన్నారు. విభజన వల్ల తలెత్తిన సమస్యలను పరిష్కరిస్తుందనే గ్యారంటీ లేదని ఆయన అన్నారు. ప్రకృతి విపత్తులను పట్టించుకోకుండా విభజనపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆయన విమర్శించారు. ఓట్లు, సీట్ల గురించే ఆలోచిస్తున్నారని, తుఫాను బాధితుల గురించి ఆలోచన చేయడం లేదని ఆయన అన్నారు.
హెలెన్ తుపాను వల్ల జరిగిన నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన అన్నారు. తుపాను నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేయలేక పోతోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం సకాలంలో సాగునీరు ఇచ్చి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదని విమర్వించారు.

తుపాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటేప్రధాని రాష్ట్ర పర్యటనకు రాలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫాను తాకిడిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత భీమా పథకం వల్ల రైతులకు ప్రయోజనం కలగడం లేదని ఆయన అన్నారు.
నీలం తుఫాను బాధితులకు ఇప్పటి వరకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేకపోయారని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. తుఫాను వల్ల నష్టపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రధాని పర్యటనకు రాకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications