తమన్నాకు రూ.2కోట్ల వజ్రం ఇచ్చిన ఉపాసన?
అగ్ర హీరోలతో తెర పంచుకుంటూనే మరోవైపు విభిన్న కథా చిత్రాల్లో, వెబ్ సిరీస్ ల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటోంది తమన్నా. ఈ అందాల భామ ఇటీవల 'లస్ట్ స్టోరీస్2'లో తన అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. 'జైలర్'లో 'నువ్వు కావాలయ్యా' పాటలకు స్టెప్‌లేసి యువత మతి పోగొట్టింది. తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాలో స్టేటస్ పెట్టింది. ఇది చూసి అభిమానులంతా ఒక్కసారిగా షాకయ్యారు. 'అప్పట్లో వచ్చిన వార్తలు పుకార్లేనా.. నిజం కాదా' అంటూ నోరెళ్ల బెడుతున్నారు.
చిరంజీవి కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్ మూవీ 'సైరా: నరసింహారెడ్డి'. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ నిర్మించారు. తమన్నా కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో నటించినందుకు చరణ్ భార్య ఉపాసన రూ.2కోట్ల విలువైన వజ్రాన్నిఇచ్చినట్లు అప్పట్లో వార్తలు పుంఖాను పుంఖలుగా వచ్చాయి. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద వజ్రం అంటూ విస్త్రత ప్రచారం జరిగింది.

అది నిజం కాదంటూ తమన్నా చావుకబురు చల్లగా చెప్పింది. ఆ ఆభరణాన్ని చేతికి ధరించి ఈ విషయం చెప్పడానికి ఎంతో బాధపడుతున్నానని, ఆరోజు బాటిల్ ఓపెనర్ తో షూట్ చేశామని, చేతికి పెట్టుకుంది నిజమైన వజ్రం కాదని ఇన్ స్టాలో స్టేటస్ పెట్టింది. దీంతో నెటిజన్లు అవాక్కయ్యారు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతోంది. 'భోళా శంకర్', 'జైలర్', 'అరణ్మణై4', 'భద్ర', 'వేద'చిత్రాల్లో నటిస్తోంది. భోళా శంకర్ విడుదలకు సిద్ధమవుతుండగా, జైలర్ ఆగస్టు 10వ తేదీన విడుదల కాబోతోంది. రజనీకాంత్ సరసన అవకాశం రావడంపై తమన్నా సంతోషిస్తోంది.












Click it and Unblock the Notifications