ఎన్టీఆర్ ఆశయం, పవన్ కల్యాణ్ ఆశయం ఒక్కటే!

కథానాయకుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జన్మదినం ఈనెల రెండోతేదీన జరిగిన విషయం తెలిసిందే. దీన్ని పురస్కరించుకొని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రత్యేకమైన వీడియో విడుదల చేశారు. రానున్న ఎన్నికల్లో పవన్ కల్యాణ్ విజయం సాధించి చట్టసభల్లోకి అడుగుపెట్టాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఇంకా ఈ వీడియోలో పరుచూరి ఏమన్నారంటే... సినిమా వేరు, రాజకీయం వేరు. సినీ పరిశ్రమకు సంబంధించినవారు రాజకీయాల్లోకి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

అన్నగారిలా పవన్ ఆశయం కూడా బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకున్నారు. కేవలం 27 సినిమాలు మాత్రమే పవన్ చేశాడు. ఏదో ఒక పార్టీలో ఉండి పార్లమెంటుకు వెళ్లాలనో, అసెంబ్లీకి వెళ్లాలనో ఆలోచన ఉండటం వేరు. ఎన్నికల్లో నిలబడగానే గెలుస్తాం.. ముఖ్యమంత్రులమైపోతాం అనేది తర్వాత విషయం. మన మాటను చట్టసభలద్వారా ప్రజలకు తెలియజేయాలి.

upcoming elections pawan kalyan in ap assembly

సమాజాన్ని బాగుచేయడానికి ఎవరికి వారు తమవంతు కృషి చేయాలి. అదే విషయాన్ని పవన్ కల్యాణ్ కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. ఎవరు కలిసి వచ్చినా? రాకపోయినా? ఆయన పోరాటం ఆయన చేసుకుంటూ వెళ్తారు.

కాబట్టి అటువంటి వాయిస్ చట్టసభలద్వారా వినిపించాలని కోరుకునే వ్యక్తుల్లో పరుచూరి గోపాలకృష్ణ కూడా ఒకరు. పవన్ కల్యాణ్ మనసు నాకు బాగా తెలుసు. మనకన్నా ఆయనకే ప్రపంచం గురించి ఇంకా ఎక్కువగా తెలుసు అనేది నా అభిప్రాయం. ప్రశ్నించే హక్కును ఆయన ప్రజాస్వామ్య బద్ధంగా రానున్నఎన్నికల్లో పొందాలని కోరుకుంటున్నాను అని పరుచూరి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+