వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణాష్టమి: తిరుమల శ్రీవారి చెంత ఉట్లోత్సవం

By Pratap
|
Google Oneindia TeluguNews

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చెంత మంగళవారం ఉట్లోత్సవం జరిగింది. కృష్ణాష్టమి సందర్భంగా యేటా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోది. ఈ సంప్రదాయబద్దమైన ఉత్సవంలో యువత ఉత్సాహం పాలు పంచుకుంది.

స్వామి మలయప్ప స్వామి, స్వామి శ్రీ కృష్ణస్వామి ఊరేగింపుతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మాడ వీధుల మీదుగా ఈ ఊరేగింపు జరిగింది. శ్రీ బేడి పెద్ద జీయంగార్ మఠం సమీపంలోని శ్రీ బేడి ఆంజనేయులు స్వామి ఆలయం నుంచి ఊరేగింపు ప్రారంభమైంది.

Utlotsavam

తిరుమల కొండపై యేటా ఈ ఉట్లోత్సవం మత సంప్రదాయం ప్రకారం జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఈవో ఎంజి గోపాల్ చెప్పారు. జీవితం స్వర్ణమయం కావాలని శ్రీ మలయప్ప స్వామి, శ్రీకృష్ణ ఆశీస్సులు అందరికీ అందుతాయని ఆయన అన్నారు.

తిరుమల కొండపై ఉట్లోత్సవం మూడు ప్రాంతాల్లో జరిగింది. ఊరేగింపులో పాల్గొన్న దైవాలు రెండు చోట్ల పాల్గొన్నారు. బహుమతి నగదును పొందడానికి యువత పెద్ద యెత్తున ఉత్సాహంగా పాల్గొంది. మనుషులు పిరమిడ్‌లాగా మారి 25 అడుగుల ఎత్తున నిలిపిన ఉట్టిని కొట్టడానికి యువకులు పోటీ పడడం చూడముచ్చటగా ఉంటుంది.

కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహర్స దీపాలంకరణ సేవలతో పాటు ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది. తిరుమల జెఈవో కెఎస్ శ్రీనివాస రాజు, అదనపు సివిఎస్‌వో శివకుమార్ రెడ్డి, డిప్యూటీ ఈవో (ఆలయం) చిన్నంగారి రమణం, ఎస్ఈ రమేష్ రెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary
The festival of ‘Utlotsavam' was observed at the famous hill temple of Lord Venkateswara amidst religious ecstasy and gaiety on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X