వాస్తు ప్రకారం ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతుంటే ఐశ్వర్యం కూడా పెరుగుతుంటుంది

ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలంటే కేవలం ఇటుకలు, ఇసుకతో నిర్మించే గోడలు మాత్రమే సరిపోవు.. ఆ ఇంట్లో ఉండే 'శక్తి' కూడా సరిగ్గా ఉండాలి. అది కూడా సానుకూల శక్తి ఉండాలి. ఎంతోమంది వాస్తు నిపుణులు ఈ విషయాన్ని తెలియజేశారు. పెరట్లో మనం పెంచుకునే మొక్కలు కూడా మన తలరాతను మార్చేస్తాయట. ఇంటిని నందనవనం చేస్తూనే, అదృష్టాన్ని మోసుకొచ్చే ఆ మొక్కల రహస్యాలేంటో ఈ సరికొత్త వాస్తు కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అదృష్టాన్ని ఆహ్వానించే 'శుభ' వృక్షాలు

వాస్తు ప్రకారం కొన్ని మొక్కలు ఇంట్లోని ప్రతికూలతను పీల్చుకుని,
సానుకూల శక్తిని విడుదల చేస్తాయి.
తులసి చెట్టు ఇంటికి మహాలక్ష్మి వంటిది. దీనిని ఎల్లప్పుడూ ఉత్తరం లేదా ఈశాన్య దిక్కుల్లోనే ఉంచాలి.
ఇది మనసులోని ఆందోళనలను తగ్గించి, ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది.
సంపద వృద్ధి చెందాలంటే మనీ ప్లాంట్‌ను,
సుగంధ పరిమళాలు వెదజల్లే పూల మొక్కలను
ఆగ్నేయ దిక్కులో ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం.

vastu tips According to the Principles if these plants grow in your home your wealth will also increase

ఆదాయ మార్గాలు పెరగడానికి,
ఆస్తి వివాదాలు తొలగడానికి
జేడ్ ప్లాంట్ మొక్కను ఇంటి ప్రవేశ ద్వారం వద్ద
లేదా తూర్పు వైపున ఉంచడం మంచిది.
మానసిక ప్రశాంతత కోసం లక్కీ బాంబూను తూర్పు లేదా ఆగ్నేయ దిక్కుల్లో ఉంచాలి.

సమస్యలను తరిమికొట్టే 'ఔషధ' వృక్షాలు

ఇంటి ఆవరణలో నిమ్మ లేదా నారింజ చెట్లు ఉంటే
ఎటువంటి వాస్తు దోషాలైనా,
నరఘోషలైనా హరించుకుపోతాయి.
ఆరోగ్యం మెరుగుపడుతుంది.
తూర్పు లేదా ఉత్తర దిక్కుల్లో అశోక చెట్టు ఉంటే
కుటుంబంలో విభేదాలు తగ్గి, అనుబంధాలు బలపడతాయి.
అందానికే కాదు, ఇంట్లోని ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన వాతావరణాన్ని
కల్పిస్తాయి మల్లె, మందారం, గులాబి

పొరపాటున కూడా ఇవి వద్దు!

కొన్ని మొక్కలు ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తి పెరిగి, కలహాలకు దారితీస్తాయి
కాక్టస్, నాగజెముడు వంటి ముళ్లు ఉండే మొక్కలను
ఇంటి ఆవరణలో అస్సలు ఉంచకూడదు.
జిల్లేడు, ఉమ్మెత్త వంటి పాలుకారే మొక్కలు
ఇంట్లో ఉండటం వాస్తు రీత్యా అరిష్టం.

ఏ దిక్కున ఏ చెట్టు ఉండాలి?

చెట్లను నాటేటప్పుడు వాటి ఎత్తు, పరిమాణాన్ని బట్టి దిక్కులను ఎంచుకోవాలి
బాదం, మామిడి వంటి పెద్ద వృక్షాలను ఎప్పుడూ దక్షిణం లేదా పడమర దిక్కుల్లోనే నాటాలి
చిన్నగా ఉండే మొక్కలను ఉత్తరం లేదా తూర్పు దిక్కుల్లో పెంచడం వల్ల సూర్యరశ్మి ఇంట్లోకి ధారాళంగా వస్తుంది.
ఇంటి ఈశాన్య మూలలో రావి, మర్రి వంటి పెద్ద చెట్లు ఉండకూడదు.
ఇది వంశాభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని శాస్త్రం హెచ్చరిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+