ICSE Result 2026 Is LIVE: ఐసీఎస్ఈ పదో తరగతి ఫలితాల ప్రకటన-ఇలా చెక్ చేసుకోండి..!
ICSE Result 2026: కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISIS) ఇవాళ ఐసీఎస్ఈ 10వ తరగతి ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు తమ ఐసిఎస్ఈ ఫలితాలను https://results.cisce.org వెబ్‌సైట్ లో చూసుకోవచ్చు. ఐసీఎస్ఈ 2026 ఫలితాల్ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి విద్యార్ధులు తమ యూనిక్ ఐడి, ఇండెక్స్ నంబర్ , క్యాప్చా కోడ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే ఐసీఎస్ఈ 10వ తరగతి మార్క్‌షీట్ డిజిలాకర్‌లో కూడా ఉంటుంది.
ఐసీఎస్ఈ 10వ తరగతి పరీక్ష 2026లో అర్హత సాధించడానికి విద్యార్థులు కనీసం 33% మార్కులను పొంది ఉండాలి. ఈ ఏడాది ఐసీఎస్ఈ 2026 పరీక్షలకు మొత్తం 2,52,557 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సంవత్సరం ఐసీఎస్ఈ పరీక్షలు ఫిబ్రవరి 17 నుండి మార్చి 30 వరకు జరిగాయి.

ICSE 10వ తరగతి ఫలితాలు 2026ను డౌన్ లోడ్ చేసుకునే విధానం
అధికారిక వెబ్ సైట్ https://results.cisce.org లోకి వెళ్లాలి
కోర్సు ఆప్షన్ నుండి ICSEను ఎంచుకోవాలి
యూనిక్ ఐడి (UID), ఇండెక్స్ నంబర్ మరియు క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి
'ఫలితాన్ని చూపించు' (Show Result) పై క్లిక్ చేయాలి
ICSE ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది
తాత్కాలిక మార్క్‌షీట్‌ను డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోవాలి














Click it and Unblock the Notifications