వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై మాట మార్చినందుకే: విజయమ్మపై ఉత్తమ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Uttam Kumar Reddy
నల్లగొండ/ హైదరాబాద్: తెలంగాణపై మాట మార్చినందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పర్యటన పట్ల తెలంగాణలో నిరసన వ్యక్తమైందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాజకీయ లబ్ది కోసం పంట నష్టం పేరిట పర్యటిస్తున్న విజయమ్మను తెలంగాణవాదులు అడ్డుకున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణిగా వైయస్ విజయమ్మను గౌరవిస్తామని, అయితే తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడితే సహించబోమని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే విజయమ్మ పర్యటన చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా వైయస్సార్ కాంగ్రెసు ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించాలని ఆయన అన్నారు.

వైయస్ కుటుంబమే దోచుకుంది..

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, వైయస్ విజయమ్మ ముఖాలు చూడడానికి తెలంగాణ ప్రజలు ఇష్టపడడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు టి. హరీష్ రావు అన్నారు. తెలంగాణను కొల్లగొట్టింది వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబమేనని ఆయన ఆరోపించారు. వైయస్ చేసిన ద్రోహాన్ని చూసేందుకు విజయమ్మ తెలంగాణలో పర్యటిస్తారా, వేయి మంది త్యాగాలకన్నా కుమారుడి సుఖమే ముఖ్యమా అని ఆయన అడిగారు.

వైయస్సార్ కాంగ్రెసు మోసాలకు డిక్షనరీలో పదాలు దొరకడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్సిస్తున్నారని ఆయన అన్నారు. అందుకే ఆదరబాదరగా నిధులు తరలించుకుని పోతున్నారని ఆయన విమర్సించారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు విషయమై తెలంగాణ మంత్రులు వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
Minister from Telangana Uttam kumar Reddy said that YSR Congress party honorary president YS Vijayamma should change her stand on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X