Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'గంటా' నిబద్ధతకు చిన్న పరీక్ష పెట్టిన చంద్రబాబు?

APలో ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈనెల 16వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.. అనంతరం మార్చి 13వ తేదీన ఎన్నిక జరగబోతోంది. అధికారంలో ఉన్న వైసీపీ 4 నెలల ముందే ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ను అభ్యర్థిని ప్రకటించి ప్రతిపక్షాలకు సవాల్ విసిరింది. వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ పార్టీని గెలిపించే బాధ్యత తీసుకున్నారు.

అభ్యర్థిని మార్చి ట్విస్ట్ ఇచ్చిన టీడీపీ

అభ్యర్థిని మార్చి ట్విస్ట్ ఇచ్చిన టీడీపీ

ఉత్తరాంధ్రలో అన్ని పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ కు కొద్దిరోజుల ముందు తమ అభ్యర్థిని మార్చి తెలుగుదేశం పార్టీ భారీ ట్విస్ట్ ఇచ్చింది. చోడవరం నియోజకవర్గం కాపు సామాజికవర్గానికి చెందిన డాక్టర్ వేపాడ చిరంజీవరావును ఎమ్మెల్సీగా బరిలోకి దింపింది. కాపు సామాజికవర్గ అభ్యర్థి అయితే గెలుపు అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయని టీడీపీ భావిస్తోంది. అంతేకాకుండా ఆయనకున్న అర్థబలం కూడా తోడైతే విజయం తమదే అనే అంచనా వేస్తోంది. పీడీఎఫ్ తరపున డాక్టర్ కోరెడ్ల రమాప్రభ బరిలోకి దిగారు. వామపక్షాలతోపాటు పలు ప్రజాసంఘాలు ఆమెకు మద్దతిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ మరోసారి బీజేపీ తరఫున బరిలోకి దిగారు. రిటర్నింగ్ అధికారిగా విశాఖపట్నం కలెక్టర్ మల్లికార్జున వ్యవహరించనున్నారు.

34 నియోజకవర్గాల పరిధిలో ఎన్నిక

34 నియోజకవర్గాల పరిధిలో ఎన్నిక

2007 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీచేయలేదు. 2011లో పోటీచేసినప్పటికీ ఓటమిపాలైంది. 2017లో మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థి మాధవ్ కు మద్దతు తెలిపి విజయానికి కారణమైంది. ఈసారి మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించి కాపు సామాజికవర్గానికి చెందిన వేపాడ చిరంజీవిరావును ఎంపిక చేసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జిలతో ఆయన సమావేశమవుతున్నారు. 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక జరగనుండటంతో చంద్రబాబునాయుడు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉద్యోగ వ్యతిరేక అంశాలకు తమకు కలిసివస్తాయని పార్టీ భావిస్తోంది.

గంటాపై బాధ్యత?

గంటాపై బాధ్యత?


మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును వేపాడ కలిసి తన గెలుపునకు సహకరించాలని కోరారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ మూడున్నర సంవత్సరాలపాటు సైలెంట్ గా ఉన్న గంటా శ్రీనివాసరావు ఇప్పడిప్పుడే టీడీపీలో యాక్టివ్ అవుతున్నారు. గంటా శ్రీనివాసరావు వేపాడకు ఎటువంటి అభయం ఇచ్చారో అనే ఆసక్తి అందరిలో వ్యక్తమవుతోంది. విశాఖ జిల్లా మొత్తం పలుకుబడి ఉన్న గంటా చోడవరం నుంచి 2004లో ఎమ్మెల్యేగా నెగ్గారు. గంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగి ప్రచారం చేస్తే ఈ ఎన్నిక కీలక మలుపు తిరుగుతుందని భావిస్తున్నారు. గంటా ఈ బాధ్యతను స్వీకరిస్తారా? లేదా? అనేది వేచిచూడాల్సి ఉంది. తాను కొన్ని అనివార్య కారణాలవల్లే దూరంగా ఉన్నానని, నారా లోకేష్ ను కలిసి మున్ముందు పార్టీలోనే కొనసాగబోతున్నట్లు గంటా చెప్పిన సంగతి తెలిసిందే.అయితే ఎమ్మెల్సీ ఎన్నికను గంటా ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయానికి కృషిచేస్తే గంటా నిబద్ధతగానే ఉన్నారు.. అనే అభిప్రాయం అటు పార్టీలోను, ఇటు ప్రజల్లోను వ్యక్తమవుతుంది. తనకెందుకులే అన్నట్లుగా లైట్ తీసుకుంటే పార్టీ పట్ల గంటా నిబద్ధతను శంకించాల్సిన అవసరం రావొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+