నేనేం చేస్తానో చూడండి: వీహెచ్ వీరంగం, చేదు అనుభవం

 V Hanumantha Rao says he will not vote to Polavaram Bill
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ రాష్ట్ర రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావుకు చేదు అనుభవం ఎదురైంది. పోలవరం ప్రాజెక్టును అడ్డుకునే విషయంలో మీరేం చేస్తారో చెప్పాలంటూ నిలదీసిన గిరిజనులపై వి హనుమంత రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలవరం ప్రాజెక్టు పైన ఆందోళన చేస్తున్న గిరిజనులు ఆయనను సోమవారం అడ్డుకున్నారు. రాజ్యసభలో మీరు గట్టిగా అభ్యంతరాలు లేవనెత్తుతారా లేదా అని నిలదీశారు. మీరు ఏం చేస్తారని ప్రశ్నించారు. దీంతో రాజ్యసభలో తాను ఏం చేస్తానో చూడండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలవరం డిజైన్ మార్చి నిర్మిస్తే తమకేమీ అభ్యంతరం లేదని గిరిజనులు అన్నారు. డిజైన్ మార్చకుండా పోలవరం నిర్మిస్తే తమ చాలా గ్రామాలు ముంపునకు గురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ధర్నాలో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ సహా పలువురు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+