పవన్‌కు అనుభవం లేదంటారా?: తెలుగుదేశంపై వీహెచ్ ఫైర్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలను ఎంపి, తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు సమర్థించారు. ఎన్నికల కోసం పవన్‌ను వాడుకున్న తెలుగుదేశం.. ఇప్పుడు రాజకీయ అనుభవం లేదనడం విడ్డూరంగా ఉందన్నారు.

ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ లాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ నాయకులు కూడా బాధితుల తరపున ఉద్యమించాలని వి హనుమంతరావు అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో సీమాంధ్ర నేతలు జోక్యం చేసుకోవడమేంటినని వీహెచ్ మండిపడ్డారు.

తెలంగాణ పిసిసి నూతన అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్కల నియామకంలో సీమాంధ్ర నేతలు జోక్యం చేసుకున్నారని వీహెచ్ పరోక్షంగా అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, పార్టీ అంతర్గత విషయాలను బాహాటంగా బయటపెట్టడంపై వీహెచ్‌ను ఎమ్మెల్సీ రంగారెడ్డి తప్పుబట్టారు.

V Hanumantha Rao supports Pawan Kalyan words

మీడియాపై ఆంక్షలను అసెంబ్లీలో ప్రస్తావిస్తాం: సంపత్‌

సచివాలయంలో మీడియా ప్రవేశించడాన్ని నిషేధించడంపై అసెంబ్లీలో గళమెత్తుతామని, ప్రభుత్వాన్ని మీడియాపై ఆంక్షల విషయంలో నిలదీస్తామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌ అన్నారు. ప్రభుత్వం ప్రోటోకాల్‌, నిధుల కేటాయింపు విషయంలో తమ పట్ల వివక్ష చూపుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఇలాగే ప్రతిపక్షాల పట్ల వివక్షను పాటిస్తే ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీని సరెండర్‌ చేస్తామని సంపత్‌ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+