TTD: ముక్కోటి వైభవం, ప్రముఖుల దర్శనం - అరుదైన ఘట్టం..!!
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి. గోవింద నామ స్మరణ తో భక్తులు తరలిస్తున్నారు. దర్శనం కోసం భారీగా భక్తులు బారులు తీరారు. స్వామి వారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించిన తరువాత భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చారు. పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. పది రోజుల పాటు తిరుమలలో ఉత్తర ద్వార దర్శన అవకాశం కల్పించారు.
తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు
వైకుంఠ ఏకాదశి కావటంతో తిరుమలలో భారీగా రద్దీ పెరిగింది. పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శకం కల్పిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దర్శనం కోసం ఏర్పాటు చేసిన టోకెన్ల కేంద్రం లో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇటు తిరుమలలో వైకుంఠ ఏకాదశి రద్దీ పెరుగుతోంది. తిరుమలలో ఈ తెల్లవారు జామున స్వామి వారికి ముందుగా ఏకాంత పూజలు చేశారు. తర్వాత అభిషేకం సేవ నిర్వహించి ఆ తర్వాత ఉదయం 3.45 కి భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. దీంతో, భక్తులు సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువును వైకుంఠంలో చూసిన అనిర్వచనీయ ఆనందాన్ని సొంతం చేసుకుంటున్నారు.

ప్రముఖుల దర్శనం
ఉదయం 8 గంటల నుంచి టోకెన్ పొందిన భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి రామ్మెహన్, రాందేవ్ బాబా, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, ఏపీ - తెలంగాణ మంత్రులు.. నందమూరి కుటుంబ సభ్యులు, అధికారులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ రోజు నుంచి 10 రోజులపాటూ వైకుంఠ ద్వారాలను తెరచి ఉంచు తున్నారు. వీవీఐపీలకు మాత్రం ప్రోటోకాల్ ప్రకారం దర్శనం ఉంటుంది. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా జనవరి 19 వరకూ ఆర్జిత సేవల్ని రద్దు చేశారు.
Sri Venkateswara Swamy Temple in Tirumala radiates divine splendor on Vaikunta Ekadasi! Stunning floral garlands, arches, and electrical illuminations transform the temple into a visual and spiritual marvel. Truly a feast for the eyes & soul!#Tirumala #VaikuntaEkadasi#TTD pic.twitter.com/9gEi9MbwrW
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) January 10, 2025
శోభాయమానంగా
తిరుమల క్షేత్రంలో నేత్ర పర్వంగా ఏర్పాట్లు చేసారు. ఏడు కొండలను అత్యద్భుతంగా తీర్చి దిద్దారు. దాదాపు 12 టన్నుల పూలను తెచ్చి.. శ్రీవారి ఆలయంతోపాటూ.. చుట్టుపక్కల ఆలయా లను అలంకరించారు. విద్యుత్ దీపాల కాంతులతో తిరుమల శోభాయమానంగా మారింది. ఇక,
వైకుంఠ ఏకాదశి కావడంతో.. ఇవాళ శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణ రథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ద్వాదశి పర్వదినాన వేకువజామున స్వామి వారి పుష్కరిణిలో చక్ర స్నానం చేయిస్తారు. ఈ అరుదైన ఘట్టం ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్తులు తిరుమలకు భారీగా చేరుకుంటున్నారు. ఇదే సమయంలో మాస్క్ ధరించి రావాలని టీటీడీ సూచిస్తోంది. ఈ పది రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు చేసారు.












Click it and Unblock the Notifications