ఆఫీస్ లేదు కానీ..: జగన్‌కు వల్లభనేని ఝలక్, పవన్ కళ్యాణ్‌పై మంత్రి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ నేత వల్లభనేని వంశీ సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ నేత వల్లభనేని వంశీ సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడలోని కాకులపాడులో జగన్ సభ పైన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏపీలో పార్టీ కార్యాలయం, ఇల్లు కూడా లేని జగన్, వారానికి ఓసారి ఇక్కడకు వచ్చి రైతుల ముసుగులో రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతుల పైన దౌర్జన్యం చేసి అనుమతి లేకుండానే సభను నిర్వహించారని ఆరోపించారు.

పవన్ అంటే గౌరవం ఉంది: మంత్రి నారాయణ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే తమకు గౌరవం ఉందని మంత్రి నారాయణ చెప్పారు. ప్రత్యేక హోదా అంశాన్ని పవన్ ప్రస్తుత దృష్టితో చూడాలని విజ్ఞప్తి చేశారు. జగన్ ప్రతిపక్ష నేతకు బదులు పైశాచికంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఉండవల్లి కాంగ్రెస్ ఏజెంట్: గోరంట్ల
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్ అని రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. కృష్ణా డెల్టాకు వెళ్లి పట్టిసీమ దండుగ అంటే ప్రజలు . వైసిపి అధినేత జగన్‌ను పెంచి పోషించింది కేవీపీ రామచంద్ర రావు, ఉండవల్లి అరుణ్ కుమార్‌లే అన్నారు.












Click it and Unblock the Notifications