బెయిల్ వద్దు, జైలుకే వెళ్తా: వల్లభనేని వంశీ, రంగంలోకి కొనకళ్ల

విజయవాడ: పోలీసులు తనపై పెట్టిన అక్రమ కేసుకు నిరసనగా స్వచ్ఛందంగా లొంగిపోవాలని, స్టేషన్ బెయిల్ కూడా తీసుకోకుండా జైలుకు వెళ్లాలని గన్నవరం తెలుగుదశం పార్టీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ నిర్ణయం తీసుకున్నారు.

విజయవాడలోని రామవరప్పాడు ఘటన విషయంలో పోలీసులు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా వంశీ తన గన్‌మెన్‌లను వెనక్కిపంపారు. గన్‌మెన్లను తిరష్కరించడంతో ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌కు గన్‌మెన్లు సమాచారాన్ని అందించారు.

వల్లభనేని వంశీ మీద పోలీసులు కేసు నమోదు చేయడం వెనక ఓ మంత్రి హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వల్లభనేని వంశీ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఆయనను బుజ్జగించేందుకు మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు కొనకళ్ల నారాయణ, కృష్ణా జిల్లా టిడిపి అధ్యక్షుడు బచ్చల అర్జును సోమవారంనాడు రంగంలోకి దిగారు.

Vallabhaneni Vamshi says he will not seek bail

వారిద్దరు వంశీ ఇంటికి వెళ్లారు. ఏ ధైర్యంతో అధికారులు తనపై కేసు పెట్టారో చెప్పాలని వంశీ వారిని అడిగినట్లు తెలుస్తోంది. ధర్నాను విరమింపజేయడానికి తాను వెళ్తే ధర్నాలో పాల్గొన్నాడని ఆరోపిస్తూ తనను ప్రథమ ముద్దాయిగా పేర్కొంటూ కేసు పెట్టడమేమిటని అడిగారు.

తనపై కేసు పెట్టించిన నేతలు ఎవరో తేలాలని ఆయన అడిగినట్లు తెలుస్తోంది. దాంతో కొనకళ్ల, అర్జునుడు ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వివరిస్తామని, ఆదోళన కార్యక్రమాన్ని విరమించాలని, పోలీసు స్టేషన్‌కు కూడా వెళ్లవద్దని వారు అన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+