వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు.. రేపు రిలీజ్ ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్ దక్కింది. ఇటీవల పలు క్రిమినల్ కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ఈరోజు ( జూలై 1, 2025 ) మరో కేసులో బెయిల్ దక్కింది. దీంతో వంశీపై ఉన్న 10 కేసుల్లోనూ బెయిల్ లభించినట్టైంది.

ఇప్పటికే పలు కేసుల్లో బెయిల్ రాగా.. ఈరోజు ప్రభుత్వ అసైన్డ్ భూములకు నకిలీ ఇళ్ల పట్టాలు జారీ చేసి ప్రజలను మోసం చేశారన్న కేసులో కూడా బెయిల్ దక్కింది. సదరు ఆరోపణలపై వంశీపై కేసు నమోదవ్వగా.. జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంతో.. రేపు జైలు నుంచి విడుదల అయ్యే అవకాశముందని భావిస్తున్నారు.

vallabhaneni-vamsi-got-bail-in-fake-house-documents-case

ఇప్పటికే బెయిల్ వచ్చిన కేసుల వివరాలు...

సత్యవర్థన్ కిడ్నాప్ కేసు..

మరోవైపు రెండేళ్ల క్రితం గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో సత్యవర్థన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేశారన్న ఆరోపణలపై వంశీపై బీఎన్‌ఎస్ 140 (1), 308, 351 (3) సెక్షన్లతో పాటు SC, ST అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరిలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసులో విజయవాడ ఎస్సీ/ఎస్టీ స్పెషల్ కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేస్తూ, రూ. 50 వేల వ్యక్తిగత బాండ్‌తో పాటు రెండు ష్యూరిటీలను సమర్పించాలన్న షరతులు విధించింది. వంశీతో పాటు మరొక నలుగురు నిందితులకు కూడా బెయిల్ లభించింది.

గనుల అక్రమ తవ్వకాల కేసు..

వల్లభనేని వంశీపై నమోదైన కేసుల్లో గనుల అక్రమ తవ్వకాల వ్యవహారం కూడా ఉంది. రాష్ట్రంలోని నిబంధనలు ఉల్లంఘించి, అనుమతిలేకుండా కొన్ని ప్రాంతాల్లో గనుల తవ్వకాలు జరిపారని కేసు నమోదైంది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ (anticipatory bail) మంజూరు చేసింది. ఈ వ్యవహారంలో ఏపీ సర్కారు సుప్రీం కోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ఆ అప్పీల్ పై రేపు ( జూలై 2, 2025 ) విచారణ జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.

వంశీపై గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయి. అధికార దుర్వినియోగం, రాజకీయ ప్రతీకార చర్యలు, నిర్బంధాలు వంటి కారణాలతో కొన్ని కేసులు ఫైల్ అయ్యాయి. అయితే ప్రధానంగా ఇటీవల పెండింగ్‌లో ఉన్న ఈ కీలక కేసులో బెయిల్ లభించడం వల్ల ఆయన విడుదలకు మార్గం సుగమమయింది.

రాజకీయ అనుభవం..

వల్లభనేని వంశీ 2009, 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత చంద్రబాబుతో విభేదాలు రావడంతో పార్టీకి దూరంగా ఉన్నారు. 2019 తర్వాత వైసీపీకి మద్దతుగా వ్యవహరించారు. వంశీపై కేసులు రాజకీయ కుట్రలో భాగమేనని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+