Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వంశీ అరెస్ట్ తో రూటు మార్చిన వైసీపీ నేతలు..!!

వల్లభనేని వంశీ అరెస్ట్ రాష్ట్రంలో సంచలనంగా మారుతోంది. వంశీ అరెస్ట్ తో వైసీపీ నేతలు ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఈ అరెస్ట్ జరిగిందని పార్టీ నేత లు విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి వంశీని వేధిస్తున్నారని... కోర్టుకు వెళ్లి రక్షణ పొందుతున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వంశీ పైన రాజకీయంగా ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

పోలీసుల విచారణ
వంశీ అరెస్ట్ వ్యవహారం కొత్త మలుపులు తీసుకుంటోంది. వంశీ అరెస్ట్ చేసిన పోలీసులు సుదీర్ఘంగా విచారణ చేస్తున్నారు. అటు గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో 35 మందిని కోర్టు ముందస్తు బెయిల్ రద్దు చేసింది. వంశీ అరెస్ట్ తో ఉమ్మడి క్రిష్ణా జిల్లా వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసారు. ఇక, స్టేషన్ వద్ద తన భర్తను ఎందుకు అరెస్ట్‌ చేశారో చెప్పడం లేదని వంశీ భార్య పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేసారు. పోలీసులు వివరాలు ఏమీ చెప్పడంలేదని.. లోపల ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. ఏ కేసులో అరెస్ట్‌ చేశారో చెప్పడం లేదని.. ఎఫ్‌ఆర్‌ కాపీ కూడా ఇవ్వడం లేదని వంశీ భార్య ఆవేదన వ్యక్తం చేసారు.

Vallabhaneni Vamsi wife Protest at Police station against his arrest YSRCP targets Govt

వంశీ సతీమణి ఆందోళన
తన భర్తను చూసేందుకు లోపలికి పంపాలని పంకజశ్రీ కోరారు. వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్‌ చేశారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ విష‌యంపై ఫిర్యాదు చేసేందుకు డీజీపీ అపాయింట్‌మెంట్ కోర‌గా, ఆయ‌న మ‌మ్మ‌ల్ని ర‌మ్మ‌ని చెప్పి క‌లవ‌కుండా అవ‌మాన‌ప‌రిచార‌ని పేర్కొన్నారు. వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదన్నారు. తప్పుడు కేసు పెట్టి ఇరికించారని విమర్శించారు. వంశీ టీడీపీ నుంచి వైయ‌స్ఆర్‌సీపీలోకి రావడం వల్ల చంద్రబాబు, లోకేష్‌లు కక్ష గట్టారని ఆరోపించారు. ఎన్నోసార్లు అరెస్ట్ చేయాల‌ని ప్రయత్నించినా వంశీ కోర్టుకు వెళ్లి ప్రొటక్షన్ తెచ్చుకున్నారని గుర్తు చేసారు. ఇవాళ అక్ర‌మ కేసులో వంశీని అరెస్టు చేశారని అంబటి ఆరోపించారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత డీజీపీపై ఉందన్నారు.

అరెస్ట్‌ చెల్లదు
సుప్రీంకోర్టు నిబంధనలను పోలీసులు పాటించడం లేదని వంశీ తరఫు లాయర్‌ చిరంజీవి అన్నా రు. వల్లభనేని వంశీ అరెస్ట్‌ చెల్లదని.. ఆయనను కావాలనే అరెస్ట్‌ చేశారన్నారు. ఏం కేసులు పెట్టారో తెలియటం లేదన్నారు. పోలీస్ స్టేషన్‌లో వంశీ లేరని అబద్ధాలు చెబుతున్నారు, ఎవరు ఫిర్యాదు చేశారని ప్రశ్నించారు. కేసు ఎందుకు పెట్టారో చెప్పడం లేదన్నారు. వంశీ లాయర్‌నని చెప్పినా లోపలకి అనుమతించడం లేదని వివరించారు. పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీలో నడుస్తోందని వ్యాఖ్యానించారు. వంశీ చాలా ధైర్యంగా ఉన్నారని చెప్పారు. తప్పుడు కేసులతో వంశీని ఎవరూ ఏం చేయలేరని అడ్వకేట్‌ చిరంజీవి పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+