శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, తిరుపతికి మరో వందేభారత్ - రూట్.. షెడ్యూల్..!!
శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతికి మరో వందేభారత్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. తిరుపతికి నిత్యం పెరుగుతున్న భక్తుల రద్దీ వేళ రైల్వే శాఖ కు వస్తున్న వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రైలు రూట్.. షెడ్యూల్ ను రైల్వే అధికారులు ఖరారు చేసారు.
రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతికి వెళ్లే భక్తుల కోసం కొత్తగా వందేభారత్ ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. తిరుపతి మీదుగా పలు రైళ్లు ఇప్పటికే కొనసాగుతుండ గా.. వందేభారత్ రైలు సికింద్రాబాద్ నుంచి కొనసాగుతోంది. అదే విధంగా తమిళనాడు, కర్ణాటక నుంచి రైల్వే శాఖకు సర్వీసులు పెంచాలనే వినతులు భారీగా వస్తున్నాయి. అందులో భాగంగా త్వరలో కర్ణాటకలోని శివమొగ్గ టౌన్-తిరుపతి మధ్య వందేభారత్ సర్వీసు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ వందే భారత్ రైలుకు రైల్వేబోర్డు నుంచి సూత్రప్రాయంగా ఆమోదం లభించినట్లు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి వెల్లడించారు. ఈ రెండు ప్రాంతాల మధ్య వందే భారత్ రైలు ప్రవేశపెట్టేందుకు రైల్వేబోర్డు ప్రతిపాదన రూపొందించిందని, ఈ మేరకు తాను రాసిన లేఖకు రైల్వేశాఖ నుంచి సమాచారం వచ్చినట్లు వెల్లడించారు.

వచ్చే నెలలో పట్టాలెక్కనున్న వందేభారత్
ఈ రైలు ప్రకటన ద్వారా బెంగళూరు పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రయోజనకంగా మారనుంది. ఈ రైలును శివమొగ్గ నుంచి బిరూర్, అర్సికెరే, కేఎస్ఆర్ బెంగళూరు, కాట్పాడి మీదుగా తిరుపతికి రూట్ ఖరారు చేసారు. అదే విధంగా ఉదయం సమయంలో శివమొగ్గలో బయల్దేరే విధంగా షెడ్యూల్ ఫిక్స్ చేస్తున్నారు. ఈ రైలును వచ్చే నెల ప్రారంభించేందుకు రైల్వే అధికారులు తుది కసరత్తు కొనసాగిస్తున్నారు. "శివమొగ్గ టౌన్-తిరుపతి-శిమమొగ్గ టౌన్ మధ్య కొత్త వందే భారత్ రైలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే బోర్డు ప్రతిపాదన తీసుకొచ్చింది. నేను రైల్వే బోర్డు చైర్మన్‌కు రాసిన లేఖ రాయగా.. సానుకూల స్పందన వచ్చింది. ఇందుకుగాను రైల్వే బోర్డు చైర్మన్‌కు ధన్యవాదాలు చెబుతున్నాను" అని గురుమూర్తి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కాగా.. త్వరలోనే విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ స్లీపర్ రైలును అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
