శబరిమలకు వందే భారత్ ప్రత్యేక రైలు; షెడ్యూల్ ఇదే!!
శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కేరళ రాష్ట్రంలోని శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి భక్తజనం పోటెత్తారు. శబరిమలకు వెళ్లే మార్గం అంతా ట్రాఫిక్ జామ్ లతో అసౌకర్యంగా మారింది. శబరిమల అయ్యప్పను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు గంటలకొద్దీ బారులు తీరుతున్నారు.
చాలామంది దర్శనం చేసుకునే పరిస్థితి లేక స్వామి దర్శనం కాకుండానే వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు. ఇక శబరిమలకు వెళుతున్న భక్తులు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తున్న క్రమంలో, దక్షిణ మధ్య రైల్వే 51 ప్రత్యేకమైన రైళ్ళను ఏర్పాటుచేసి భక్తులకు సౌకర్యాన్ని అందిస్తుంది. అయితే తీరా అక్కడకు వెళ్ళిన భక్తులు సౌకర్యాలు లేక, రద్దీ దెబ్బకు ట్రావెన్ కోర్ బోర్డు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే శబరిమల వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సదరన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై కొట్టాయం మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రత్యేక రైలు నడపాలని సదరన్ రైల్వే నిర్ణయించింది. డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి కొట్టాయం వరకు వందే భారత్ రైలును వారంలో రెండు రోజులపాటు నడపాలని నిర్ణయం తీసుకుంది.
వందే భారత్ ట్రైను శబరిమలకు వెళ్లే భక్తులకోసం చెన్నై కొట్టాయం మధ్య నడిపించాలని నిర్ణయించిన క్రమంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు రైల్వే అధికారులు. ఇక ఈ వందే భారత్ ట్రైన్ షెడ్యూలు కూడా విడుదల చేశారు. డిసెంబర్ 15, 17, 22, 24 తేదీలలో వందేభారత్ రైలు చెన్నై నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల 15నిమిషాలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం నాలుగు గంటల 15నిమిషాలకు కొట్టాయం చేరుకుంటుంది.
అలాగే 06152 వందే భారత్ శబరి రైలు డిసెంబర్ 16, 18, 23, 25 తేదీలలో కేరళ టౌన్ నుండి ఉదయాన్నే నాలుగు గంటల 40 నిమిషాలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం ఐదు గంటల 15 నిమిషాలకు చెన్నై చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ రైలు కాట్పడి, సేలం, పాలక్కడ్, అలువా స్టేషన్లలో ఆగుతుందని అధికారులు చెబుతున్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications