అలర్ట్: వందేభారత్ లో కీలక మార్పులు!
దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లు 25 మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. వారం రోజుల్లోనే మరో నాలుగు మార్గాల్లో అందుబాటులోకి రానున్నాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. త్వరలో పట్టాలెక్కబోయే వాటిల్లో అధునాతన సౌకర్యాలను సమకూరుస్తోంది. ఫీచర్లను కూడా పూర్తిగా మెరుగుపరుస్తున్నారు.
* అత్యసవర సమయంలో లోకో పైలెట్ తో మాట్లాడేందుకు బోర్డర్ లెస్ ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ ఏర్పాటు చేస్తున్నారు.
* అగ్ని ప్రమాదాలను గుర్తించేందుకు ఏరోసోల్ ఫైర్ డిటెక్షన్ వ్యవస్థను మెరుగు పరుస్తున్నారు.
* నాణ్యమైన ఎయిర్ కండిషనింగ్ కోసం ప్యానల్స్ లో మార్పులు చేస్తున్నారు.
* అత్యవసర సమయంలో రైలును ఆపేందుకు ఎమర్జెన్సీ పుష్ బటన్ ను పైలెట్ కు సులువుగా యాక్సెస్ అయ్యేలా మార్పు పచేస్తున్నారు.

* ప్రమాదాలు జరిగిన సమయంలో ఒక కోచ్ నుంచి మరో కోచ్ లో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు వీలుగా అసెంబ్లీ డోర్ ప్యానల్స్
* టాయిలెట్ లో లైటింగ్ మెరుగుపరుస్తున్నారు.
* వాష్ బేసిన్ సైజ్ పెంచుతున్నారు. అలాగే వాటర్ ట్యాప్స్, టాయిలెట్ హ్యాండిల్స్ లో కూడా మార్పులు చేస్తున్నారు.
* కోచ్ ల మధ్య కనెక్టివిటీ కోసం యాంటీ క్లైంబర్స్ అనే కొత్త భద్రతా వ్యవస్థ ఏర్పాటు.
* త్వరలోనే స్లీపర్ కోచ్ ల పరిచయం. తయారీ కోసం రష్యాకు చెందిన ట్రాన్స్ మాష్ హోల్డింగ్ తో 120 కోచ్ ల తయారీకి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఒప్పందం.
* భెల్ తో కలిసి టిటానగర్ వ్యాగన్స్ లిమిటెడ్ 80 కోచ్ లను తయారుచేయబోతోంది.
* వందే భారత్ కోచ్‌లలో ప్రయాణికులు కూర్చునే సీట్లు గట్టిగా ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి. దీంతో కొత్త కోచ్ ల్లో మెత్తటి కుషన్‌లను ఉపయోగిస్తున్నారు.
* ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ సీట్ల రంగును ఎరుపు నుంచి నీలంకు మారుస్తున్నారు.
* ఫుట్‌రెస్ట్‌ను మరింత పొడిగిస్తున్నారు.
* సీట్ల వెనుక మ్యాగజైన్ బ్యాగ్స్ ఏర్పాటు చేయబోతున్నారు.
* కూర్చునే విధానం మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు సీటు రిక్లైనింగ్ యాంగిల్‌ను పెంచుతున్నారు. దీనివల్ల సీట్లను వెనక్కి జరుపుకోవడానికి వీలుంటుంది.
* దివ్యాంగుల వీల్‌ఛైర్ కోసం ప్రత్యేక పాయింట్‌ను ఏర్పాటు చేసి, అక్కడే వారికి సీటు కేటాయించనున్నారు












Click it and Unblock the Notifications