Vande Bharat : యూత్ ఛాయిస్ గా వందే భారత్ రైళ్లు-డేటా వెల్లడించిన రైల్వే..
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇప్పుడు వందే భారత్ రైళ్లకు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ప్రారంభించిన వందే భారత్ రైళ్లకు ఆదరణ లభిస్తోంది. ఇందులో యువత ఎక్కువగా వందే భారత్ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. తాజాగా దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన సమాచారం మేరకు యువతకు అత్యంత ఇష్టమైన రవాణా సాధనంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు అవరించినట్లు తేలింది.
ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న వందే భారత్ రైళ్లలో 56% మంది ప్రయాణికులు యువకులు ,శ్రామిక వర్గాలకు చెందిన వారేనని అధికారులు వెల్లడించారు. వందే భారత్ రైళ్లలో ప్రయాణిస్తున్న వారిలో వీరి సంఖ్య ఎక్కువగా ఉంటోందని తాజాగా రైల్వే నిర్వహించిన అధ్యయనంలో తేలింది. వందే భారత్ రైళ్లలో లభిస్తున్న సదుపాయాలు, సౌకర్య వంతమైన ప్రయాణం, సమయం ఆదా కావడం వంటి కారణాలతో యూత్ ఎక్కువగా వీటిని ఇష్టపడుతున్నారు.

ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఐదు వందే భారత్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. ఇందులో సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖపట్నం, కాచిగూడ-యశ్వంత్ పూర్ (హైదరాబాద్-బెంగళూరు), విజయవాడ-చెన్నై రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో ఆక్యుపెన్సీ 100 శాతం ఉంటోంది. అలాగే దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన డేటా ప్రకారం సగటున 29.08% మంది ప్రయాణికులు 25-34 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులుగా గుర్తించారు.
అలాగే 35-49 సంవత్సరాల మధ్య వయస్సు పరిధిలో ఉన్న వారు సగటున 26.85% మంది ప్రయాణికులు ఉన్నట్లు తేలింది. వీరంతా ఇతర రవాణా సాధనాల కంటే వందే భారత్ రైళ్లలోనే ప్రయాణించేందుకు ఇష్టపడుతున్నట్లు గుర్తించారు. ఈ లెక్కన చూస్తే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వందే భారత్ రైళ్లలో మొత్తం 56% మంది ప్రయాణికులు యువకులు ,శ్రామిక వర్గాలకు చెందినవారుగా తేలింది.

ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ సిటిజన్లు కూడా ఎక్కువగా సౌలభ్యం, వేగం కోసం వందే భారత్ రైళ్లను ఆశ్రయిస్తున్నారు. మొత్తం ప్రయాణికుల్లో సగటున 11.81 % ప్రయాణీకులు 60+ వయస్సు గల వర్గానికి చెందినవారు ఉన్నారు. వందే భారత్ రైళ్లు ప్రారంభించిన తేదీ నుంచి ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 7.16 లక్షల మంది ప్రయాణికులు ఈ రైళ్లలో ప్రయాణించారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications