తెలుగు రాష్ట్రాలకే తొలి వందేభారత్ స్లీపర్ - రూట్ ఫిక్స్..!!
తెలుగు రాష్ట్రాలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్. త్వరలో ప్రారంభించే వందేభారత్ స్లీపర్ ను తెలుగు రాష్ట్రాలకు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ మేరకు రైల్వే శాఖకు తాజాగా ప్రతిపాదనలు అందించారు. ఆగస్టు 15న తొలి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించారు. వందేభారత్ స్లీపర్ తో పాటుగా మరో వందేభారత్ ను తెలుగు రాష్ట్రాలకు కేటాయించేలా కసరత్తు జరుగుతోంది.
వందే భారత్ స్లీపర్
కేంద్రం వందేభారత్ సర్వీసులను పెంచేందుకు నిర్ణయించింది. దూరం ప్రాంతాల మధ్య వందేభారత్ స్లీపర్ సేవలు ప్రారంభం కానున్నాయి. తొలుత ఈ రైలు అహ్మదాబాద్ - ఢిల్లీ మధ్య ప్రారంభించాలని తొలుత భావించారు. అయితే, ప్రస్తుతం రైల్వే అధికారుల నుంచి అందుతున్న సమాచారం మేరకు సికింద్రాబాద్ - ముంబాయి మధ్య ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ప్రారంభించే మూడు వందేభారత్ స్లీపర్ సర్వీసుల్లో ఒకటి సికింద్రాబాద్ - పూణే మధ్య ప్రారంభించాలని నిర్ణయించారు.

తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా
కాగా, ఇప్పుడు సికింద్రాబాద్ - ముంబాయి మధ్య వందేభారత్ స్లీపర్ ప్రారంభించటం ద్వారా ప్రయాణీకుల నుంచి ఆదరణ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కాచిగూడ - సికింద్రాబాద్ స్టేషన్ల నుండి వందే భారత్ స్లీపర్ రైళ్లను నడపాలని ప్రతిపాదించారు. కాచిగూడ-విశాఖపట్నం, కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్-పుణె వంటి రద్దీ రూట్లలో కొత్త వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని అధికారులు కోరుతున్నారు. కొత్త వందే భారత్ స్లీపర్ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. ఈ రైళ్లు రాత్రిపూట కూడా నడుస్తాయి.
అధికారుల కసరత్తు
వందేభారత్ స్లీపర్ లో ఏసీ, నాన్ ఏసీ కోచ్‌లు ఉండనున్నాయి. టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే, సికింద్రబాద్ నుంచి ముంబాయి, కాచిగూడ నుంచి పూణే ఈ రెండు వందేభారత్ స్లీపర్ రైలు ప్రారంభించాలనే ప్రతిపాదనల్లో ఒకటి ఖాయంగా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో మరో వందేభారత్ కూడా ప్రకటించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ కొత్త సర్వీసుల పైన క్లారిటీ రానుంది.












Click it and Unblock the Notifications