ఇచ్చిన హామీపై అడిగితే.. మహిళలను విచక్షణారక్షితంగా కొట్టిస్తారా: జగన్‌పై వంగలపూడి అనిత ఫైర్

అమరావతి: ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు చేశారు. జైల్లో ఉన్నప్పుడు వైఎస్ జగన్ తరపున ఆయన తల్లి, చెల్లి ప్రజల్లోకి వెల్లి వారి ఆశీర్వాదం కోరారని, అందుకే ఆయన అధికారం చేపట్టడానికి వారు సహకరించారని, గత ఎన్నికల్లో రాష్ట్ర మహిళల ఆశీర్వాదం కూడా అందుకు తోడైందని అన్నారు.

మహిళలను విచక్షణారక్షితంగా కొట్టించిన ఘనతే మీదే

మహిళలను విచక్షణారక్షితంగా కొట్టించిన ఘనతే మీదే

సోమవారం మంగళిగిరిలోని పార్టీ కార్యాలయంలో వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. మహిళల అభిమానంతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. నేడు అదే మహిళామణులను రోడ్లపైకి తీసుకొచ్చాడని మండిపడ్డారు. పాదయాత్ర సమయంలో అక్కా, చెల్లీ అంటూ హామీలతో ఊదరగొట్టిన జగన్.. రూ. 10వేల జీతం ఇస్తామంటూ యానిమేటర్లు, మెప్మా ఆర్పీలకు ఆశలు కల్పించారని.. అదే హామీపై ప్రశ్నించారన్న అక్కసుతో నేడు 37 వేల మంది యానిమేటర్లు, ఆర్పీలను పోలీసులతో కొట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలని కూడా చూడకుండా.. వారి ఒంటి మీద బట్టలు తొలగిపోతున్నాయనే విచక్షణ కూడా లేకుండా మగ పోలీసులే వారిని ఈడ్చుకెళ్లడం ఎంతటి దారుణమో ప్రజలు ఆలోచించాలని అనిత అన్నారు. జగన్ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నించడమే వారు చేసిన నేరమా? అని అనిత ప్రశ్నించారు. పెంచుతామన్న రూ. 10 వేల జీతం గురించి ప్రశ్నిస్తే.. అమ్మఒడి ఇచ్చామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

అమ్మఒడికి కోతలు పెట్టారు..

అమ్మఒడికి కోతలు పెట్టారు..

అమ్మఒడి పేరుతో నిధులు ఇస్తూ నాన్న జేబుకు చిల్లు పెట్టడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ఇప్పటివరకూ అమలు చేసిన అన్ని పథకాల మాదిరే తల్లులకు డబ్బులిచ్చే అమ్మఒడిలో కూడా జగన్ ప్రభుత్వం కోతలు పెట్టిందని ఆరోపించారు. గతంలో 84 లక్షల మంది తల్లులకు నిధులు ఇస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక దాన్ని 40 లక్షలకే పరిమితం చేశారన్నారు. ఇద్దరు పిల్లలు ఉండకూడదు , రేషన్ కార్డు ఉండకూడదనే నిబంధనలతో ఆ పథకాన్ని నీరుగార్చారన్నారు. తల్లి తన ఒడిని ఇద్దరు పిల్లలకు సమానంగానే పంచుతుందని, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ ఒడిని ఒక్కరికే పరిమితం చేశారని అనిత ఎద్దేవా చేశారు.

నిధులు మళ్లించి.. లబ్ధిదారులకు పథకాలు వర్తించవు అంటారా?

నిధులు మళ్లించి.. లబ్ధిదారులకు పథకాలు వర్తించవు అంటారా?


అమ్మఒడి పథకం నిధులు పొందిన జాబితాలో యానిమేటర్లు , ఆర్పీలు ఉంటే వారికి జీతాలు ఇవ్వమనడం, అదే పథకానికి అర్హులైన వారికి ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు రావని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ నిధులను అమ్మఒడి పథకానికి మళ్లించి తిరిగి అవే నిధులు పొందిన లబ్ధిదారులకు ఇతర పథకాలు వర్తించవని చెప్పడం ఎలాంటి పరిపాలన కిందకు వస్తుందో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని అనిత డిమాండ్ చేశారు.

రూ. 3వేలకు పెంచుతామని.. ఉన్న పింఛన్లు ఎత్తివేసి..

రూ. 3వేలకు పెంచుతామని.. ఉన్న పింఛన్లు ఎత్తివేసి..

పింఛన్లు రూ. 3000 వేలకు పెంచుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, అధికారంలో రాగానే 7లక్షల పింఛన్లు తీసేశాడన్నారు. పింఛన్ల తొలగింపు, రేషన్ కార్డుల తీసివేత , అమ్మఒడి కోత, ఫీజు రీయింబర్స్ మెంటు బకాయిల నిలుపుదల వంటి చర్యల ద్వారా రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి ఏడుపునే మిగిల్చారన్నారు అనిత. జగన్ పాలనలో విద్యార్థులు, తల్లులు, రైతులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులకు ఏడుపులే మిగిలాయన్నారు. తన తండ్రి ఇచ్చిన రేషన్ కార్డులను కూడా పిచ్చి పిచ్చి నిబంధనలతో తీసేయడం జగన్‌కే సాధ్యమైందన్నారు.

అంతా జే ట్యాక్సు..

అంతా జే ట్యాక్సు..

అన్ని వర్గాలను మోసం చేసినట్టుగానే 37 వేల మంది యానిమేటర్లు, ఆర్పీలను మోసం చేయవద్దని అనిత హితవు పలికారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం నుంచి వివిధ రకాల కారణాలతో తిరిగి అదనపు వసూళ్లు చేస్తున్నారని.. అదంతా జగన్ జే ట్యాక్స్‌లో భాగమేనన్నారు. దిశా చట్టంపై అసెంబ్లీలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన వైసీపీ మహిళా నేతలంతా, రాష్ట్రంలో అమాయకులైన బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే ఎందుకు నోరెత్తడం లేదని నిలదీశారు. ‘దిశ' చట్టమో.. పథకమో ప్రభుత్వం స్పష్టం చేయాలని చట్టమైనేది ప్రజలకు మేలు చేస్తుందని, పథకమైతే ప్రజలకోసం అమలు చేసేదని తేడా లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అనిత మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+