Vangalapudi Anitha: అనితమ్మ పల్లె పలకరింపు.. అందుకేనా!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఏపీలో ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికల్లో అమీ తుమీ తేల్చుకోవటానికి రెడీ అవుతున్నాయి. ఇక ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్న నేతలు కూడా ఎన్నికల సమరానికి సిద్ధం అవుతున్నారు. ఎన్నికల వేళ పల్లెల బాట పడుతూ పలకరింపులకు శ్రీకారం చుడుతున్నారు.

ఇదిలా ఉంటే పాయకరావుపేట నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ టికెట్ తనదేనని భావిస్తున్న టిడిపి రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాయకరావుపేటలో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం రాజుపేట గ్రామంలో టిడిపి రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలు, పాయకరావుపేట నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ వంగలపూడి అనిత అనితమ్మ పల్లె పలకరింపు కార్యక్రమం చేపట్టారు.

vangalapudi anitha going to public with an innovative program in payakaraopet constituency

అనితమ్మ పల్లె పలకరింపు కార్యక్రమంలో భాగంగా అక్కడ పర్యటించిన వంగలపూడి అనితకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనిత ఇంటింటికి తిరుగుతూ కర పత్రాలు పంచుతూ వారి కష్టాలు అడిగి తెలుసుకొన్నారు. ఆమె టిడిపి మ్యానిఫెస్టో లోని అంశాలు ఇంటింటికి ప్రచారం చేశారు . ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్య లో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని వంగలపూడి అనిత పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు.ఇదే సమయంలో వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వంగలపూడి అనిత జగన్మోహన్ రెడ్డి గుర్తించుకో...! నీ ఆటవిక పాలనకు స్వస్తి పలకడానికి ప్రజలు "సిద్ధం"గా ఉన్నారని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ అరాచక ప్రభుత్వ పాలన కొనసాగుతుందని "దోచుకో దాచుకో పంచుకో" అన్న రీతిలో సాగుతుందని మండిపడ్డారు.

vangalapudi anitha going to public with an innovative program in payakaraopet constituency

ఈ దోపిడీనీ ఎవరు ప్రశ్నించినా జగన్ రెడ్డి అనుచరులు తట్టుకోలేకపోతున్నారని, భౌతిక దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. విషాదంలో కెల్లా విషాదం ఏంటంటే దోపిడీని,అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీ కార్యకర్తలకు వత్తాసు పలుకుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. జగన్ రెడ్డిని గద్దె దించటం ఖాయమని అనిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే అనితమ్మ పల్లె పలకరింపు ఎన్నికలలో ఓట్ల కోసమే, ప్రజలను ప్రసన్నం చేసుకోవటం కోసమే అని అనుకుంటున్నారు స్థానికులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+