విమర్శల ఎఫెక్ట్: టీటీడీ బోర్డు నుంచి వంగలపూడి అనిత తొలగింపు
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నుంచి విశాఖపట్నం పాయకరావుపేట ఎమ్మెల్యే అనితను తొలగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె క్రైస్తవురాలు అనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.
అందుకు ఆమె చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలోను హల్‌చల్ సృష్టించింది. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అనితను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో చోటు తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యే వంగలపూడి అనిత కూడా ఇటీవల చోటు దక్కించుకున్నారు. విమర్శలు రావడంతో ఆమె అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
టీటీడీ పాలక వర్గం సభ్యురాలిగా తన నియామకాన్ని ఉపసంహరించుకోవాలని ఆమె కొద్ది రోజుల క్రితం సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆమెను తొలగించారు.
తాను క్రైస్తవురాలిని అని, తన హ్యాండ్ బ్యాగ్‌లో ఎప్పుడూ బైబిల్ ఉంటుందని అనిత ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు ప్రభుత్వం టీటీడీలో క్రైస్తవులకు చోటు కల్పిస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
-
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు..












Click it and Unblock the Notifications