వైయస్సార్ క్రిమినల్స్ పార్టీ నడుపుతున్న జగన్ రెడ్డి ఫార్ములా ఇదే: ఏకిపారేసిన వంగలపూడి అనిత

తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను ఏపీ సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కొండాపూర్ లోని ఆయన నివాసానికి వెళ్లిన సిఐడి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అయితే దేశం పార్టీ మాజీ మంత్రులు, నేతలపై అక్రమ కేసులు పెట్టడం, అక్రమంగా అరెస్టు చేయడంపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా విరుచుకు పడుతున్నారు.

జనం దృష్టి మళ్ళించటం కోసం ఎప్పుడూ ఇదేనా? అనిత ధ్వజం

జనం దృష్టి మళ్ళించటం కోసం ఎప్పుడూ ఇదేనా? అనిత ధ్వజం

తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై టిడిపి తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఒక్క జగన్మోహన్ రెడ్డినే కాకుండా ఇటీవల చోటు చేసుకున్న అనేక పరిణామాలపై వైసిపి మంత్రులను, మాజీ మంత్రి కొడాలి నానిని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా వంగలపూడి అనిత ఏకిపారేశారు. జగన్ రెడ్డి మన మీద అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు మొదలు పెట్టాడు అంటే జగన్ రెడ్డి గ్రాఫ్ దారుణంగా పడిపోయింది అని, తెలుగుదేశం గ్రాఫ్ బాగా పెరిగిందని అర్ధం అని పేర్కొన్నారు వంగలపూడి అనిత. మహిళల హత్యలు,వారిపై అఘాయిత్యాలు, పెరిగిన రేట్లు, పన్నుల బాదుడే బాదుడు అంటూ రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై మాట్లాడిన వంగలపూడి అనిత జనం దృష్టి మరల్చాలి. ఎప్పుడూ ఇదేనా? కొత్తగా ట్రై చెయ్ అంటూ జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చారు.

వైయస్సార్ క్రిమినల్స్ పార్టీ నడుపుతున్న జగన్ రెడ్డి ఫార్ములా ఇది

వైయస్సార్ క్రిమినల్స్ పార్టీ నడుపుతున్న జగన్ రెడ్డి ఫార్ములా ఇది

నీ మీద కడుక్కోలేనంత బురద ఉన్నపుడు దానిలో కొంత పక్కనున్న వాడి మీద కూడా జల్లెయ్. అప్పుడు అందరూ ఒకేలా కనిపిస్తారు అనేదే వైయస్సార్ క్రిమినల్స్ పార్టీ నడుపుతున్న జగన్ రెడ్డి ఫార్ములా. లీకేజే లేదంటూ కూసిన మంత్రులు, ఆస్థాన నీలి మీడియా ఇప్పుడు మడమ తిప్పి మాపై బురద జల్లడానికి సిద్ధం అయ్యారు అంటూ మండిపడ్డారు. సిగ్గులేని జాతి అంటూ తిట్టిపోశారు. అంతేకాదు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణ ఘటనలపైన విమర్శలు గుప్పించిన వంగలపూడి అనిత 880 మందికి పైగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరిగాయి.

రోజాపైనా, కొడాలి నాని పైనా అనిత మండిపాటు

రోజాపైనా, కొడాలి నాని పైనా అనిత మండిపాటు

నిన్నటికి నిన్న కావ్య అనే అమ్మాయిని ఓ ఉన్మాది ఏకంగా గన్ తోనే కాల్చి చంపాడు. గన్ కన్నా ముందు జగన్ వస్తాడు అంటూ ఎలివేటెడ్ పెర్ఫార్మెన్స్ లు ఇచ్చిన రోజా గారిని అడుగుతున్నా.. ఎక్కడమ్మా ఆ జగన్? ఇంకెంత మంది బలయ్యాక వస్తాడు? అంటూ మంత్రి రోజాను టార్గెట్ చేశారు. ఇక తాజాగా చంద్రబాబుపై విమర్శలు చేసిన మాజీ మంత్రి కొడాలి నాని పై మండిపడిన అనిత సన్న బియ్యం సన్నాసికి చాలా రోజులకి మళ్ళీ పెడిగ్రీ బిస్కట్లు పడ్డట్లున్నాయి. మొరగడానికి ప్రతిఫలంగా మూడు క్యాసినోలు,ఆరు పేకాటస్థావరాలు అని ఆఫర్ ఇచ్చినట్లున్నాడు తుగ్లక్ సైకో. మా నాయకుణ్ణి ఏది అంటే మీకు, మీ నాయకుడికి అదే వడ్డిస్తాం. వద్దంటే సభ్యతగా, హూందాగా మాట్లాడండి. గివ్ అండ్ టేక్ అంటూ కొడాలి నాని కి చురకలంటించారు.

ప్రతిపక్షాల మీద పడి ఏడవడానికే నీ బతుకంతా సరిపోతుంది: సజ్జలకు చురకలు

ప్రతిపక్షాల మీద పడి ఏడవడానికే నీ బతుకంతా సరిపోతుంది: సజ్జలకు చురకలు


ఇక పొత్తులపై సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడిన వంగలపూడి అనిత సజ్జల రెడ్డి నెలకు లక్షలకి లక్షలు జనం సొమ్ము మెక్కుతున్నావు. జగన్ రెడ్డి నిన్ను జనం సొమ్ముతో మేపుతుంది ప్రభుత్వాన్ని సరిగా నడపడానికి సలహాలు ఇచ్చిచావమని. ఆ పని వదిలేసి లేచింది మొదలు చంద్రబాబు గారి మీద,ప్రతిపక్షాల మీద పడి ఏడవడానికే నీ బతుకంతా సరిపోతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెక్కే సొమ్ముకి అయినా న్యాయం చెయ్ అంటూ సజ్జల రామకృష్ణ రెడ్డిని టార్గెట్ చేశారు. తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న ప్రతి ఒక నేతను పేరుపేరునా టార్గెట్ చేస్తున్న వంగలపూడి అనిత జగన్ పాలనలో ప్రజలకు రక్షణ లేదని పదే పదే తేల్చి చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+