ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికెళ్ళి తాటతీస్తా; ఎమ్మెల్యే రోజా అందుకు సిద్ధమా: వంగలపూడి అనిత
వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పై తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ఆయనపై ద్వజమెత్తారు. వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారని వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఆ విషయం మర్చిపోయి వైసీపీలో గుర్తింపు కోసం తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తున్నారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రసన్నకుమార్ రెడ్డి చరిత్ర అంతా నా దగ్గర ఉంది: అనిత
నెల్లూరు టీడీపీ నారీ సంకల్ప దీక్షలో తాను పాల్గొని వచ్చిన తర్వాత ఒక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకు నోటి దురద ఎక్కువైందని వంగలపూడి అనిత మండిపడ్డారు. తన తండ్రి పలుకుబడితో, టిడిపి పెట్టిన రాజకీయ భవిష్యత్తుతో ఎమ్మెల్యేగా గెలిచిన సదరు వ్యక్తి మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ప్రసన్న కుమార్ రెడ్డి చరిత్ర మొత్తం తన దగ్గర ఉందని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డికి హైదరాబాద్లో ఉన్న ఇల్లు ఎవరికి రాసిచ్చారో దమ్ముంటే చెప్పాలని వంగలపూడి అనిత ప్రశ్నించారు.
ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను భారతీ రెడ్డి ఒప్పుకుంటారా ?
తనకు తాను రాజకీయ దురంధురుడిని అని చెప్పుకునే సదరు సోకాల్డ్ ఎమ్మెల్యేకి గుర్తింపు పిచ్చి పరాకాష్టకు చేరుకుంది అని అనిత మండిపడ్డారు. ఎమ్మెల్యే మాటలకు బెదిరింపులకు, అనిత భయపడదు అని స్పష్టం చేశారు. అధికారంలో ఉండి మహిళలను గౌరవించలేని ఇలాంటి పశుప్రవృత్తి కలిగినవారికి మనుషులుగా బతికే అర్హత ఉందా అంటూ వంగలపూడి అనిత ప్రశ్నించారు. ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను భారతీ రెడ్డి ఒప్పుకుంటారా ? అంటూ ప్రశ్నించారు.

అబద్దపు ప్రచారం ఆపకుంటే ఇంటికెళ్ళి తాట తీస్తా
తన గురించి అబద్ధపు ప్రచారం చేయడం ఆపకపోతే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి తాట తీస్తానని వంగలపూడి అనిత హెచ్చరించారు. ఇలాంటి వారికి ఒక తల్లి కడుపున పుట్టే అర్హత కూడా లేదని విమర్శించారు. ఎమ్మెల్యే తల్లి భార్య ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న వారో, తాను అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషినేనని స్పష్టం చేశారు. తన వ్యక్తిత్వం గురించి విమర్శలు చేసే ఎమ్మెల్యే తన భార్య, తన తల్లి, తన కూతురు ముందు ముందు ఎంత క్షోభ పడాల్సి వస్తుందో గుర్తుపెట్టుకొని మాట్లాడితే మంచిదని పేర్కొన్నారు. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డికి ఎంత మంచి పేరు ఉందో, ఆయన కడుపున పుట్టిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంత సిగ్గు లేని వ్యక్తిగా తయారు అయ్యాడని వంగలపూడి అనిత విమర్శించారు.

వారి ఇళ్ళకు వెళ్లి బడితె పూజ చేస్తాం
చంద్రబాబు సీఎం అవ్వగానే మహిళలను అవమానించిన వైసీపీ నేతల ఇళ్లకు వెళ్లి బడిత పూజ చేస్తామని ధ్వజ మెత్తారు. టిడిపి పునాదిపై రాజకీయ జీవితాన్ని నిర్మించుకుని చంద్రబాబు గారి చావును కొరత అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి వ్యక్తిత్వానికి తన వ్యక్తిత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని వంగలపూడి అనిత అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గం లో పొలాలకు చెరువులకు నీళ్లు ఇవ్వాలంటే ప్రజల దగ్గర కప్పం వసూలు చేస్తున్నారని, అది ఆయన క్యారెక్టర్ అంటూ వంగలపూడి అనిత ధ్వజమెత్తారు.

నియోజకవర్గంలో కమీషన్లు వసూలు చేసే వీరత్వం, ధీరత్వం అందరికీ తెలుసు
గ్రావెల్ తవ్వకాలను మొదలుకొని, లేఔట్ల యజమానుల నుండి కమీషన్లు వసూలు చేస్తున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వీరత్వం,ధీరత్వం అందరికీ తెలుసు అని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. పోలీసులను, అధికారులను కించపరుస్తూ, అందరిని బెదిరించే వ్యక్తిత్వం ఎమ్మెల్యే అని మండిపడ్డారు. గతంలో సినిమా వాళ్లను బలిసి కొట్టుకుంటున్నారని సోకాల్డ్ ఎమ్మెల్యే అన్నారని, ఇప్పుడు ఎవరు బలిసి కొట్టుకుంటున్నారో ప్రజలకు అర్థమైందని వంగలపూడి అనిత పేర్కొన్నారు.
Recommended Video

రోజాని టార్గెట్ చేసిన వంగలపూడి అనిత; రోజాకు సవాల్
ఇదే సమయంలో నగరి ఎమ్మెల్యే రోజా ని టార్గెట్ చేసిన వంగలపూడి అనిత మహిళా సంక్షేమం పై మహిళా సాధికారత పై బహిరంగంగా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. జబర్దస్త్ ప్రాసలు చూపించడం కాదు ఆమెకు నిజంగా ధైర్యం ఉంటే అమరావతి మహిళల మధ్యకు వచ్చి మహిళా సంక్షేమ పై మాట్లాడాలని ఎమ్మెల్యే రోజా పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. లేదంటే ఆమె ఎక్కడికి రమ్మంటే కానీ అక్కడకు వెళ్తానని వంగలపూడి అనిత చెప్పారు. ఆమె వస్తుందో లేదో చెప్పాలని అనిత ప్రశ్నించారు. ఎమ్మెల్యే రోజా నగిరి లో పోటీ చేస్తే డిపాజిట్ తెచ్చుకోగలరా అంటూ వంగలపూడి అనిత సవాల్ విసిరారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications