వైసీపీ ఎంపీగా ఎన్నికల బరిలో వంగవీటి రాధా - సీటు ఖరారు..!?
ఏపీ ఎన్నికల రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. సామాజిక సమీకరాణల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీఎం జగన్ వ్యూహాలు ప్రతిపక్షాలకు అంతు చిక్కటం లేదు. టీడీపీ, జనసేన పొత్తుతో జగన్ ఇంఛార్జ్ మార్పులో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముద్రగడ జనసేనవైపు చూస్తున్నారనే ప్రచారం వేళ మరో ఆసక్తి కర పరిణామం చోటుచేసుకుంటోంది. వంగవీటి రాధా తిరిగి వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఎన్నికల రాజకీయం : ఏపీ ఎన్నికల వేళ కాపు వర్గం మద్దతు కీలకంగా మారుతోంది. టీడీపీ, జనసేన పొత్తుతో జగన్ అలర్ట్ అయ్యారు. ప్రతిపక్షాలు ఏకమై తన పైన ఓటమికి ప్రయత్నిస్తున్న వేళ సంచలన నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. కృష్ణా జిల్లాలో సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో ముద్రగడ పద్మనాభవం జనసేన వైపు చూస్తున్నారనే ప్రచారం మొదలైంది. ఈ సమయంలో వంగవీటి రాధా తో వైసీపీ ముఖ్య నేతలు టచ్ లోకి వెళ్లారు. మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇప్పటికే రాధాను వైసీపీలోకి రావాలని ఆహ్వానించారు. 2019 ఎన్నికల ముందు రాధా టీడీపీలో చేరినా.. అంత యాక్టివ్ గా లేరు. జనసేనలో చేరాలంటూ రాధా కు ఆహ్వానం అందింది.

మార్పులు - చేర్పులు : దీంతో, రాధా రాజకీయ అడుగులు ఎటు వైపు ఉంటాయనే చర్చ కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. రాధా వైసీపీలోకి వస్తే మచిలీపట్నం లోక్ సభ సీటు ఇచ్చేలా ఆఫర్ ఇచ్చారని పార్టీ నేతల సమాచారం. విజయవాడ స్థానం కేశినేని నానికి ఖరారు చేసారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండో లోక్ సభ స్థానంగా ఉన్న మచిలీపట్నం కాపు వర్గానికి ఇవ్వాలనేది వైసీపీ ఆలోచన. దీంతో, రాధాతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. రాధా ముందుకు వస్తే నాలుగో జాబితాలో మచిలీపట్నం పేరు ఖరారవుతుందని చెబుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి మచిలీపట్నం ఎంపీగా వ్యవహరించిన ఒక సీనియర్ నేత కమార్తె కూడా సీటు ఆశిస్తున్నవారిలో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీగా బాలశౌరి ఉన్నారు. ఆయన పార్టీ మారుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

రాధా నిర్ణయం ఏంటి : దీంతో, రాధా 2019 ఎన్నికల సమయంలో విజయవాడ సెంట్రల్ సీటు ఆశించారు. ప్రస్తుతం సెంట్రల్ సీటు టీడీపీ నుంచి బోండా ఉమా, వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఇవ్వటం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలో రాధాను ఎంపీగా పంపాలని వైసీపీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని పైన ఈ రోజు లేదా రేపు స్పష్టత వస్తుందని చెబుతున్నారు. మచిలీపట్నం పరిధిలోనే గుడివాడ, గన్నవరం. పెనమలూరు వంటి నియోజకవర్గాలు ఉండటంతో రాధా పోటీ చేయటం ద్వారా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో, ఇప్పుడు రాధా తీసుకొనే నిర్ణయం ఏంటనే ఆసక్తి కొనసాగుతోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications