వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పారు: వంగవీటి రాధా!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల పైన టిడిపి నేత వంగవీటి రాధాకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి సందర్భంగా విజయవాడ బందర్ రోడ్ లోని రంగా విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వంగవీటి రాధా, రంగా జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నామని రంగా ఆశయ సాధన కోసం అందరూ కలిసి పని చేస్తామని తెలిపారు.
ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన వంగవీటి రాధా
ఇక ఇదే సమయంలో ఆయన ఏపీ ఎన్నికల ఫలితాలపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు పదవుల కోసం జరిగిన ఎన్నికలు కాదని ప్రజల కోసం జరిగిన ఎన్నికలని రాధా పేర్కొన్నారు. అందుకే ఈ ఎన్నికలలో ప్రజలే గెలిచారు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ప్రభుత్వాలు ప్రాముఖ్యత ఇవ్వాలని వంగవీటి రాధా సూచించారు.

ప్రజలు నాయకులకు ఎలా బుద్ధి చెబుతారో చూశాం
ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకోకపోతే ప్రజలు నాయకులకు ఎలా బుద్ధి చెబుతారో ఈ ఎన్నికలలో మనం చూశామంటూ వంగవీటి రాధా వ్యాఖ్యానించారు. ప్రతి సామాన్యుడికి న్యాయం జరగాలన్నది తన తండ్రి రంగా ఆశయమని పేర్కొన్నారు. అందరం కష్టపడి పని చేసేది పనిచేసింది, ప్రజల క్షేమం కోసమే అని వంగవీటి రాధా తెలిపారు.
ఎన్నికలు జరిగింది పదవుల కోసం కాదు
మొన్న జరిగిన ఎన్నికలు బేరసారాల కోసమో, పదవుల కోసమో జరిగిన ఎన్నికలు కాదని స్పష్టం చేశారు. మొన్న ఎన్నికల్లో ప్రజలను పట్టించుకోనివారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. వంగవీటి రంగ ఆశయ సాధనకు ప్రతి సామాన్యుడికి న్యాయం జరిగే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని రాధా తెలిపారు.
తనకు కీలక పదవి వస్తుందా అంటే స్పందించని రాధా
ఇక ఇదే సమయంలో గత ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం కీలకంగా పని చేసిన వంగవీటి రాధాకు ఈ ప్రభుత్వంలోనైనా ప్రాముఖ్యత వచ్చే అవకాశం ఉందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు వంగవీటి రాధా సమాధానం చెప్పలేదు. కానీ ఎన్నికల ఫలితాలను బట్టి ప్రజలే ప్రధానం అంటూ వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications