వంగవీటిపై కోర్టుకు: రాంగోపాల్ వర్మకు రాధా వార్నింగ్, డిజిపితో భేటీ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'వంగవీటి' చిత్రం పైన తనకు అభ్యంతరాలు ఉన్నాయని వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకష్ణ శుక్రవారం నాడు తెలిపారు.
విజయవాడ: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'వంగవీటి' చిత్రం పైన తనకు అభ్యంతరాలు ఉన్నాయని వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకష్ణ శుక్రవారం నాడు తెలిపారు. సినిమా విడుదల నేపథ్యంలో ఏపీ డీజీపీ సాంబశివరావుతో వంగవీటి రాధా భేటీ అయ్యారు.
ఈ సినిమాలో వంగవీటి రంగా కుటుంబానికి సంబంధించిన దృశ్యాల పైన కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చిత్రం పైన తాను కోర్టుకు వెళ్తానని చెప్పారు. కాగా, రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని డిజీపీ సాంబశివరావు సూచించారు.

కాగా, నిజ జీవిత కథల్ని మంచి ఇంటెన్సిటీతో డ్రమటిగ్గా ప్రెజెంట్ చేయడంలో రాం గోపాల వర్మది అందె వేసిన చేయి. ఆ విషయాన్ని తన ప్రత్యేకతను 'రక్తచరిత్ర' సినిమాతో మరోసారి చాటుకున్నాడు. అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో 'రక్తచరిత్ర' సినిమా తీసారు. అనంతరం బెజవాడ రాజకీయాలను 'వంగవీటి' సినిమాతో తెరకెక్కించారు.












Click it and Unblock the Notifications