జగన్ పై రాధా సంచలనం .. నమ్మించి నట్టేట ముంచటం జగన్ కు అలవాటని కామెంట్

ఎన్నికల ముందు వరకు వైసీపీలో ఉండి తాజాగా టీడీపీ తీర్ధం పుచ్చుకున్న వంగవీటి రాధా జగన్ కు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. జగన్ ను ఓడించటమే లక్ష్యంగా పెట్టుకుని టీడీపీ తరపున ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నుండి విజయవాడ సెంట్రల్ టికెట్ ఆశించి భంగపడిన రాధా పలు నాటకీయ పరిణామాల మధ్య టీడీపీలో చేరారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై భగ్గుమంటున్న టీడీపీ నేత వంగవీటి రాధా సంచలన ఆరోపణలు చేశారు.

వంగవీటి రాధా ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడారు. ఆయన జగన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు .ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి వంగవీటి స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరిస్తున్నారు.

Vangaveeti Radha sensational comments on YS Jagan .. deceive the people who trust him


నమ్మించి నట్టేట ముంచడం జగన్ కి ముందు నుంచీ అలవాటేనని రాధా ఆరోపించారు. అంతే కాదు ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తామని ఆశ చూపి అభ్యర్థులతో కోట్లు ఖర్చుపెట్టిస్తారని ఆయన ఆరోపించారు. తీరా ఎన్నికల సమయంలో టికెట్‌ ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇస్తామంటూ మభ్యపెట్టడం జగన్‌కు పరిపాటిగా మారిందని చెప్పుకొచ్చారు. నవరత్నాలు ప్రకటించి ఏ రత్నం ఇవ్వాలో తెలియని అయోమయంలో జగన్‌ ఉన్నారని వంగవీటి రాధాకృష్ణ ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+