ఆపెయ్, లేకుంటే: వర్మకు వాణీవిశ్వనాథ్ హెచ్చరిక, అల్లుళ్లపై ఏం చెప్పారంటే: లక్ష్మీపార్వతి షాకింగ్

Posted By:
Subscribe to Oneindia Telugu
Actress Vani Viswanath Warned Ram Gopal Varma For His Film On NTR | Oneindia Telugu

అమరావతి: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీయనున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై నిన్నటి తరం హీరోయిన్, టిడిపిలో చేరుతానని చెప్పిన వాణీవిశ్వనాథ్ స్పందించారు.

బాబు పావులు: రోజాకు చెక్ చెప్పేందుకు రంగంలోకి వాణీ విశ్వనాథ్

వర్మ సినిమాపై ఇప్పటికే టిడిపి నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారా లోకేష్, వంగలపూడి అనిత తదితరులు స్పందించారు. ఇప్పుడు వాణీ విశ్వనాథ్ దర్శకుడిపై మండిపడ్డారు.

 వెంటనే ఆపెయ్

వెంటనే ఆపెయ్

సినిమాను తెరకెక్కించే ప్రయత్నాన్ని వెంటనే రామ్ గోపాల్ వర్మ ఆపేయాలని వాణీవిశ్వనాథ్ హెచ్చరించారు. ప్రజలు దేవుడిగా చూసే ఎన్టీఆర్ గౌరవానికి భంగం కలిగించేలా సినిమాను తీస్తే చూస్తూ ఊరుకోబోమని ఆమె అన్నారు.

వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరిక

వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరిక

మొండిగా సినిమాను తీస్తానని ముందుకు వెళ్తే తాము ఊరుకునేది లేదని వాణీ విశ్వనాథ్ చెప్పారు. అవసరమైతే వర్మ ఇంటిముందు ధర్నా చేస్తామని చెప్పారు. ప్రజలు ఎన్టీఆర్‌లో రాముడిని, కృష్ణుడిని చూసుకుంటున్నారని చెప్పారు.

 బాలకృష్ణ చెబుతున్న సమయంలో..

బాలకృష్ణ చెబుతున్న సమయంలో..

ఓ వైపు ఎన్టీఆర్ బయోపిక్‌ను బాలకృష్ణ తీయబోతున్న తరుణంలోనే రామ్ గోపాల్ వర్మ ఇలాంటి సినిమాను తీయడం సరైంది కాదని వాణీ విశ్వనాథ్ అన్నారు. సినిమాకు వర్మ పెట్టిన పేరులోనే వ్యాపారం, వివాదం దాగి ఉన్నాయని మండిపడ్డారు.

 వర్మ సినిమాపై అనుమానాలు

వర్మ సినిమాపై అనుమానాలు

రామ్ గోపాల్ వర్మ తీయబోయే సినిమాపై అనుమానాలు ఉన్నాయని వాణీ విశ్వనాథ్ చెప్పారు. కేవలం దురుద్దేశ్యంతో వర్మ ఈ సినిమాను తెరకెక్కించనున్నారని మండిపడ్డారు. సినిమాను గొప్పగా తీస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం, ఇబ్బంది లేదన్నారు. కాని ఇష్టారీతిన తీయాలనుకుంటే మానేయడం మంచిదన్నారు.

 ఇద్దరు అల్లుళ్ల వల్ల టిడిపి ఓడిందని

ఇద్దరు అల్లుళ్ల వల్ల టిడిపి ఓడిందని

ఇద్దరు అల్లుళ్ల వల్ల నాడు టిడిపి ఓడిపోయిందని ఎన్టీఆర్ నమ్మడం వల్లే తనను ఉపయోగించుకున్నారని లక్ష్మి పార్వతి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇద్దరు అల్లుళ్ల వల్ల టిడిపి ఓడిపోయిందని ఎన్టీఆర్ నమ్మూతూ వచ్చారో, అందుకనే, నన్ను ఉపయోగించుకున్నారన్నారు. ఓ విశ్వాసపాత్రురాలిగా భావించారన్నారు.

 తనదే కంట్రోల్ అని ఎన్టీఆర్ చెప్పారు

తనదే కంట్రోల్ అని ఎన్టీఆర్ చెప్పారు

నేను ఎవ్వరి అభిప్రాయం తీసుకోదలచుకోలేదని నాడు ఎన్టీఆర్ తనకు చెప్పారని లక్ష్మీపార్వతి అన్నారు. టిడిపి అధ్యక్షుడిగా తాను పూర్తి కంట్రోల్ పెట్టదలుచుకున్నట్లు చెప్పారని లక్ష్మీపార్వతి అన్నారు. నాడు ఎన్టీఆర్ తన సాయం కోరారని, నా భార్య, సహచరి, అన్నీ నువ్వే అని చెప్పారని, అభ్యర్థులకు సంబంధించిన నివేదికలు ఎలా తెప్పిస్తావో తెప్పించమని, తనకు ఫీడ్ చేయమని చెప్పారని అన్నారు. ఆయన చెప్పినట్లు నేను చేశానని అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actress Vani Viswanath on Friday lashed out at director Ram Gopal Varma for his film on NTR.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి